For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురి తప్పిన షూటర్లు: నాలుగో రోజు ఒక్క పతకం కూడా గెలవలేదు

Manu, Heena fizzle out in qualifications; Anish finishes 5th

హైదరాబాద్: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌ను గొప్పగా ఆరంభించిన భారత షూటర్లు నాలుగో రోజు తీవ్రంగా నిరాశపరిచారు. తొలి రెండు రోజుల్లో రెండు స్వర్ణాలు దక్కగా.. తర్వాతి రెండు రోజులూ నిరాశే మిగిలింది. ఒత్తిడికి లోనైన భారత స్టార్‌ షూటర్లు అంచనాలను అందుకోలేకపోయారు.

ఫలితంగా ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్ వరల్డ్‌కప్‌లో టోర్నమెంట్‌లో నాలుగో రోజు భారత్‌ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. ఈ టోర్నీలో అంచనాల్ని ఏమాత్రం అందుకోలేపోయిన యువ సంచలనం మను భాకర్‌.. మరో ఈవెంట్‌లోనూ విఫలమైంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టర్‌ ఈవెంట్లో మను భాకర్ ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.

10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మను భాకర్ 14వ స్థానంలో నిలవగా అనురాధ, హీనా సిద్ధూ 22వ, 25వ స్థానాల్లో నిలిచారు. మరో స్టార్‌ షూటర్‌ హీనా సిద్ధు సైతం అర్హత రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌లో గాయత్రి 36వ స్థానంలో, సునిధి చౌహాన్‌ 49వ స్థానంలో నిలిచారు.

పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో ఆదర్శ్‌ సింగ్, అర్పిత్‌ గోయల్‌ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరగ్గా... 16 ఏళ్ల అనీశ్‌ భన్వాలా ఫైనల్‌కు చేరినా పతకం నెగ్గలేదు. ఆరుగురు పోటీపడ్డ ఫైనల్లో అతను 14 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు. మిగతా ఈవెంట్లలోనూ భారత షూటర్లు నిరాశ పరిచారు.

Story first published: Wednesday, February 27, 2019, 9:56 [IST]
Other articles published on Feb 27, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+