ప్రపంచ రికార్డుతో స్వర్ణం నెగ్గిన మను బకర్

హైదరాబాద్: ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత యువ షూటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఇటీవల కాలంలో సంచలన ప్రదర్శన చేస్తోన్న మను బకర్ మరోసారి అదరగొట్టింది. జర్మనీలోని సల్ నగరంలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో ప్రపంచ రికార్డు స్కోరుతో స్వర్ణం సాధించింది.
మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంటులో 16 ఏళ్ల మను 242.5 స్కోరు నమోదుచేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. మరోవైపు కైమాన్ లు(చైనా, 236.9), ఝు లీ(చైనా, 216.2) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఈ ఏడాది మనుకు ఏడో అంతర్జాతీయ వ్యక్తిగత స్వర్ణం కావడం విశేషం.
ప్రపంచ రికార్డు ప్రదర్శనతో ఆమె స్వర్ణం గెలవడం మూడోసారి. మరోవైపు పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంటులో అనీష్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ 17 పతకాలతో కొనసాగుతున్నది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications