న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్ షూటర్..అయిదో స్థానంలో: అదే దూకుడు కంటిన్యూ చేయగలిగితే..!

Manu Bhaker stands 5th in 1st round of qualification in women’s 25m pistol at Tokyo Olympics 2020

టోక్యో: జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఒలింపిక్స్‌లో ఏడోరోజు.. భారత్ అంచనాలకు మించిన స్థాయిలో రాణిస్తోంది. బాగా అచ్చి వచ్చిన కేటగిరీల్లో ముందుడగు వేసింది. ఫస్ట్ హాఫ్‌లో.. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం సాధించడాన్ని హైలైట్‌‌గా చెప్పుకోవచ్చు. పురుషుల హాకీలో మన్‌ప్రీత్ సింగ్ టీమ్.. నాలుగో విజయాన్ని అందుకుంది. మొత్తంగా అయిదు మ్యాచ్‌లను ఆడిన హాకీ ఇండియా.. నాలుగుసార్లు విజేతగా నిలిచింది. పురుషుల సూపర్ హెవీవెయిట్ కేటగిరీలో భారత బాక్సర్ సతీష్ కుమార్ స్ఫూర్తిదాయక గెలుపు అందుకున్నారు. క్వార్టర్‌ఫైనల్స్‌లోకి అడుగు పెట్టాడు.

మహిళా షూటర్లు మిక్స్డ్ ఫలితాలను అందుకున్నారు. అసాకా షూటింగ్ రేంజ్‌లో నిర్వహించిన 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ క్వాలిఫికేషన్ కేటగిరీలో భారత స్టార్ షూటర్ మను భాకర్ అయిదో స్థానంలో నిలిచారు. 30 సార్లు లక్ష్యాన్ని గురి చూసి బుల్లెట్‌ను పేల్చాల్సిన ఈ విభాగంలో మను భాకర్ 292 పాయింట్లను సాధించారు. సగటున 9.733తో నిలిచారు. మను భాకర్‌తో పాటు ఇదే కేటగిరీలో పాల్గొన్న భారత షూటర్ రాహి సర్నోబత్ 287 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నారు. మను భాకర్ కంటే ముందు సెర్బియా షూటర్ జొరానా అరునోవిక్-296, గ్రీస్‌కు చెందిన అన్నా కొరకాకి 294 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

తన తొలి రిలేలో రాహి సర్నోబత్ 10 షాట్లతో 96వ స్థానంలో నిలిచారు. రెండో రిలేలో 97కు దిగజారారు. 8, 9 బంచ్‌లల్లో నిర్వహించిన ఫైనల్ సిరీస్‌లో రాహి.. 94వ స్థానానికి చేరుకున్నారు. ఈ ప్రెసిషన్ రౌండ్‌లో రాహి 300లకు 287 పాయింట్లతో నిలిచారు. మూడో రిలేలో మను భాకర్ అద్భుతంగా రాణించారు. 97 పాయింట్లను సాధించారు. మూడో రౌండ్‌లో రెండుసార్లు మాత్రమే తొమ్మిది పాయింట్లను సాధించిన ఆమె ఆ తరువాతి రౌండ్‌లో బౌన్స్ బ్యాక్ అయ్యారు. 98 అక్యుములేటెడ్ పాయింట్లతో టాప్-5లో చోటు దక్కించుకోగలిగారు. అయిదు స్థానంలో నిలిచారు.

Story first published: Thursday, July 29, 2021, 12:03 [IST]
Other articles published on Jul 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X