Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షాట్‌పుటర్‌ మన్‌ప్రీత్‌ కౌర్‌పై నిషేధం

Manpreet Kaur banned for four years

భారత షాట్‌ పుటర్‌ మన్‌ప్రీత్‌ కౌర్‌పై వేటు పడింది. డోపింగ్‌కు పాల్పడినందుకు మన్‌ప్రీత్‌పై జాతీయ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఈ విషయాన్ని నాడా డైరెక్టర్‌ జనరల్‌ నవీన్‌ అగర్వాల్‌ ప్రకటించారు.

2017లో మన్‌ప్రీత్‌ కౌర్‌ డోప్‌ పరీక్షల్లో నాలుగు సార్లు విఫలమైంది. 2017 జులై 20 నుంచి మన్‌ప్రీత్‌పై నిషేధం అమల్లోకి వస్తుంది. దీంతో మన్‌ప్రీత్‌ 2017 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సాధించిన స్వర్ణాన్ని, జాతీయ రికార్డు (18.86మీ)ను మన్‌ప్రీత్‌ కోల్పోనుంది. అయితే తనపై విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ యాంటీ డోపింగ్‌ అప్పీల్‌ ప్యానెల్‌కుమన్‌ప్రీత్‌ అప్పీల్‌ చేసుకునే అవకాశంను కల్పించారు.

2017లో ఆసియా గ్రాండ్‌ప్రి, ఫెడరేషన్‌ కప్, ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్, ఇంటర్‌ స్టేట్‌ చాంపియన్‌షిప్‌లలో మన్‌ప్రీత్‌ కౌర్‌కు డోపింగ్‌ పరీక్షలు నిర్వహించగా.. నాలుగు సార్లు 'పాజిటివ్‌'గా తేలింది. ఒక సారి మెటనొలోన్, మూడు సార్లు డైమిథైల్‌బుటిలమైన్‌ వంటి నిషేధిక ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో నాడా మన్‌ప్రీత్‌ కౌర్‌పై వేటు వేసింది.

Story first published: Wednesday, April 10, 2019, 10:25 [IST]
Other articles published on Apr 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+