Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రేక్ థ్రూ స్టార్ అవార్డు అందుకున్న మానిక బాత్రా(వీడియో)

Manika Batra receives Breakthrough Star award from International Table Tennis Federation

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టేబుల్‌ టెన్నిస్‌ స్టార్ ప్లేయర్ మానిక బత్రా అరుదైన ఘనత అందుకుంది. అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) అందించే ప్రతిష్టాత్మక 'బ్రేక్‌థ్రూ టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌' అవార్డు దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత టీటీ క్రీడాకారిణి మనికనే కావడం విశేషం. అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలోని ఇంచియోన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో మనికకు ఈ అవార్డు ప్రదానం చేశారు.

వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ విజయాలకు

‘ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. దీనిని పొందినందుకు ఎంతో గర్వంగా ఉంది. నా కెరీర్‌లో అత్యుత్తమమైన ఈ ఏడాది చాలా గొప్పగా 2018 మిగిలిపోనుంది. ఎప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఈ విజయాలకు కారణమైన నా కుటుంబానికి ధన్యవాదాలు' అని మానిక తెలిపింది.

కెరీర్‌లోనే ఉత్తమంగా 52వ స్థానాన్ని

ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళా టీటీ జట్టు స్వర్ణం నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన మానిక.. సింగిల్స్‌లోనూ పసిడి సొంతం చేసుకుంది. మరో రెండు పతకాలు నెగ్గింది. ఆసియా క్రీడల్లో శరత్‌ కమల్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యం కైవసం చేసుకుంది. అలాగే ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లోనే ఉత్తమంగా 52వ స్థానాన్ని సాధించింది.

భారత మహిళల జట్టు స్వర్ణం గెలవడంలో

ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడల్లో వ్యక్తిగత పసిడి పతకంతో పాటు జట్టు విభాగంలో భారత మహిళల జట్టు స్వర్ణం గెలవడంలో మనిక కీలక పాత్ర పోషించింది.

Story first published: Thursday, December 13, 2018, 17:24 [IST]
Other articles published on Dec 13, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+