Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రశంసల వెల్లువ: నాలుగున్నర నెలల ప్రెగ్నెన్సీతో వింబుల్డన్ బరిలోకి

హైదరాబాద్: సాధారణంగా గర్భం ధరించిన మహిళలు ఎక్కువ శాతం విశ్రాంతిని కోరుకుంటారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంటికే పరిమితమవుతారు. కానీ లక్సెంబర్గ్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి మాండీ మినెల్లా మాత్రం ఆటపై తనకున్న మక్కువను చంపుకోలేక నాలుగున్నర నెలల ప్రెగ్నెన్సీతోనే వింబుల్డన్ బరిలోకి దిగింది.

సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో 31 ఏళ్ల మాండీ మినెల్లా ఇటలీ క్రీడాకారిణి షియవోన్ చేతిలో 1-6, 1-6తో ఓటమి పాలైనా టోర్నీకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి. వదులుగా ఉండే దుస్తులు ధరించినప్పటికీ మినెల్లా కోర్టులో మాత్రం చురుకుగానే పరుగెత్తింది.

Mandy Minella reveals she is four-and-a-half months pregnant after losing to Francesca Schiavone at Wimbledon

ఓటమి అనంతరం తాను గర్భవతిని అని చెప్తున్న ఓ ఫోటోను మినెల్లా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. ఫోటోలో కోర్టులోనే తన భర్త, కోచ్ టిమ్ సోమెర్ మోకాళ్లపై వంగి తన కడుపును ముద్దాడుతూ ఉండటాన్ని మనం చూడొచ్చు. ఈ ఏడాది వింబుల్డన్ పోటీల్లో మినెల్లా సింగిల్స్, డబుల్స్‌లో ఆడుతోంది.

Mandy Minella reveals she is four-and-a-half months pregnant after losing to Francesca Schiavone at Wimbledon

సింగిల్స్‌లో ఓడినా డబుల్స్‌లో సెవాస్టోవా (లాత్వియా)తో కలిసి మినెల్లా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇదిలా ఉంటే అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గర్భవతిగానే టెన్నిస్ ఆడింది. అయితే వింబుల్డన్ టోర్నీకి మాత్రం సెరెనా విలియమ్స్ దూరంగా ఉంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+