Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అయేషాతో పెళ్లి అబద్ధం: మాలిక్


ఇస్లామాబాద్: హైదరాబాద్ అమ్మాయి అయేషాతో తనకు పెళ్లి జరగలేదని పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ స్పష్టం చేశారు. అయేషా తండ్రి సిద్దిఖి కావాలని తనను వేధిస్తున్నాడని ఆయన మీడియాతో అన్నారు. పెళ్లి జరగనప్పుడు విడాకులు ఇచ్చే ప్రసక్తి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అయేషాను పెళ్లి చేసుకుందామని అనుకున్న మాట నిజమేనని, అయితే తన కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో పెళ్లి జరగలేదని ఆయన అన్నారు.

అయేషాతో ఎంగేజ్ మెంట్ మాత్రమే జరిగిందని, పెళ్లి జరగలేదని ఆయన అన్నారు. అయేషాతో తనకు చాలా కాలం నుంచి పరిచయం ఉందని మాత్రం ఆయన అంగీకరించారు. పూర్తి వివరాలతో త్వరలో మీడియా ముందుకు వస్తానని ఆయన చెప్పారు. అయేషా మానసిక స్థితి సరిగా లేదని వచ్చిన వార్తలపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. తన కూతురు అయేషాను మాలిక్ పెళ్లి చేసుకున్నారని, విడాకుల కోసం కోర్టుకెక్తుతామని సిద్దిఖి అన్న విషయం తెలిసిందే.
Story first published: Sunday, February 3, 2008, 16:08 [IST]
Other articles published on Feb 3, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+