Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాకేం భయం లేదు: మాలిక్

Shoaib Malik
ఇస్లామాబాద్: హైదరాబాదులో ఇండియన్ ప్రీమియం లీగ్ (ఐపియల్) మ్యాచులు ఆడడానికి తనకు ఏ విధమైన సమస్యా ఉండదని పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టైన్ షోయబ్ మాలిక్ అంటున్నారు. హైదరాబాదుకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేశాడనే ఆరోపణను ఆయన ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. మాలిక్ 2002లో తన కూతురు అయేషాను పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని హైదరాబాదుకు చెందిన సిద్దిఖి ఆరోపిస్తున్నారు.

తాను హైదరాబాదు అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని, తనను ఇంటర్నెట్ పెళ్లి కుంభకోణంలో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని మాలిక్ అంటున్నారు. మాలిక్ పై కోర్టుకు వెళ్తానని సిద్ధిఖి హెచ్చరిస్తున్నాడు. ఐపియల్ లో ఆడడానికి తాను హైదరాబాదు వస్తున్నట్లు చెప్పాడు. తాను సిద్ధిఖి కుటుంబానికి రెండు నోటీసులు పంపానని, తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నించినందుకు క్షమాపణ చెప్పాలని తాను డిమాండ్ చేశానని, వాటికి వారి నుంచి సమాధానం లేదని ఆయన చెప్పారు. తానేమీ దాచడానికి ప్రయత్నించడం లేదని, భయపడడం లేదని ఆయన చెప్పారు.
Story first published: Monday, April 21, 2008, 14:17 [IST]
Other articles published on Apr 21, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+