బెంగళూరు: బాలీవుడ్ అందాల తార లారా దత్తాను టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి వివాహం చేసుకోబోతున్నాడు. వారి వివాహం గోవాలోని ఓ లగ్జరీ రిసార్ట్ లో ఫిబ్రవరి 19వ తేదీన జరుగుతోంది. ఈ వివాహానికి కేవలం 300 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. వారిలో చాలా మంది కుటుంబ సభ్యులు, మిత్రులు మాత్రమే ఉన్నారు. పెళ్లి కూతురు మాజీ విశ్వసుందరి లారా దత్తా తన పాఠశాల విద్యను బెంగళూర్ లో సాగించింది. లారా దత్తా తెల్లటి గౌన్ లో పెళ్లి కూతురిగా ముస్తాబవుతుందని భావిస్తున్నారు. న్యూయార్క్ లో జరిగిన యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటు సందర్భంగా 2010 సెప్టెంబర్ లో 32 ఏళ్ల లారా దత్తాతో మహేష్ భూవతి నిశ్చితార్థం జరిగింది. చెన్నైలో డేవిస్ కప్ జరుగుతున్న సందర్భంలో వారిద్దరు ట్విట్టర్ లో తమ పెళ్లి విషయం రాసుకున్నారు. దాంతో ఈ విషయం బయటపడింది. #13;