Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చేజారిన బ్లిట్జ్‌ టైటిల్‌.. హంపికి 12వ స్థానం!!

Magnus Carlsen wins world blitz title, Koneru Humpy 12th

మాస్కో (రష్యా): రెండు రోజుల క్రితం ప్రపంచ మహిళల ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న భారత చెస్‌ నంబర్‌వన్‌ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి బ్లిట్జ్‌ విభాగంలో మాత్రం నిరాశపరిచింది. సోమవారం ముగిసిన ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో హంపి నిర్ణీత 17 రౌండ్లలో 10.5 పాయింట్లు ఖాతాలో వేసుకొని 12వ స్థానంలో నిలిచింది. మొత్తం 17 రౌండ్ల ఈ బ్లిట్జ్‌ కేటగిరిలో ఆదివారం తొమ్మిది రౌండ్లు.. సోమవారం ఎనిమిది రౌండ్లు జరిగాయి.

హంపి 17 రౌండ్ల తర్వాత 10.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను ప్రకటించగా.. హంపికి 12వ స్థానం దక్కింది. 14వ రౌండ్‌ వరకు రెండో స్థానంలో కొనసాగి స్వర్ణ, రజత, కాంస్య పతకాల రేసులో నిలిచిన హంపి.. వరుసగా 15, 16, 17వ రౌండ్‌లలో ఓడిపోయి బ్లిట్జ్‌ టైటిల్‌ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. బ్లిట్జ్‌ టోర్నీలో హంపి ఎనిమిది గేముల్లో విజయం సాధించి, నాలుగు గేముల్లో ఓడి, ఐదు గేమ్‌లను 'డ్రా' చేసుకుంది.

మరో భారత క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక (10 పాయింట్లు) 25వ స్థానంలో నిలిచింది. రష్యా ప్లేయర్‌ లగ్నో కటెరీనా 13 పాయింట్లతో అగ్రస్థానాన నిలిచి టైటిల్‌ కైవసం చేసుకుంది. 12.5 పాయింట్లతో అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌) రజతం, 12 పాయింట్లతో తాన్‌ జోంగి (చైనా) కాంస్య పతకం దక్కించుకున్నారు.

ర్యాపిడ్‌ ఓపెన్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన నార్వే గ్రాండ్‌మాస్టర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌.. బ్లిట్జ్‌ విభాగంలోనూ టైటిల్‌ గెలిచి 'డబుల్‌' సాధించాడు. నిర్ణీత 21 రౌండ్ల తర్వాత కార్ల్‌సన్, హికారు నకముర (అమెరికా) 16.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. ఇక విజేతను నిర్ణయించడానికి రెండు గేమ్‌లు నిర్వహించగా.. తొలి గేమ్‌ను కార్ల్‌సన్‌ 'డ్రా' చేసుకున్నాడు. రెండో గేమ్‌లో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. తాజా విజయంతో కార్ల్‌సన్‌ చెస్‌లోని క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్‌ ఫార్మాట్‌లలో ప్రపంచ చాంపియన్‌గా ఉన్నాడు.

Story first published: Tuesday, December 31, 2019, 8:49 [IST]
Other articles published on Dec 31, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+