For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దిగ్గజ చెస్ ప్లేయర్ కు షాకిచ్చిన 9 ఏళ్ల బాలుడు!

ప్రపంచ చెస్ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ షాక్! అది కూడా 9 ఏళ్ల బాలుడు చేతిలో. తాజాగా జరిగిన చెస్ పోటీలో అగ్రశ్రేణి చెస్ ప్లేయర్ అయిన మాగ్నస్ ను ఓడించాడు ఆ బాలుడు. ఇంతకీ అతడు ఎవరంటే?

దిగ్గజ చెస్ ప్లేయర్ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ తో పోటీ పడటం అంటేనే చెస్ క్రీడాకారుల్లో అదో పెద్ద విషయం. అలాంటిది అతడిని ఓడించడాన్ని పెద్ద ఘనతలా భావిస్తుంటారు. అయితే తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ర్యాన్‌ రషీద్‌ ముగ్దా.. ఓ ఆన్‌లైన్‌ చెస్ టోర్నమెంట్లో కార్ల్‌సన్‌ను ఓడించాడట. ఈ విషయాన్ని ఆ బాలుడి కోచ్‌ నయీమ్‌ హక్‌ తెలిపాడు.

Magnus Carlsen lost the game against by 9-year old boy Rashid Mugdha from Bangladesh

జనవరి 18న బుల్లెట్‌ బ్రౌల్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ జరగగా.. ఇందులో మాగ్నస్‌పై ముగ్దా పై విజయం సాధించాడని నయీమ్‌ పేర్కొన్నాడు. అయితే చెస్‌.కామ్‌లో ముగ్దాకు సొంత అకౌంట్‌ లేదని చెప్పిన కోచ్.. తన ప్రొఫైల్‌ నుంచే బుల్లెట్‌ బ్రౌల్‌ టోర్నీలో ముగ్గా ఆడాడని.. అప్పుడే అతడికి అనుకోకుండా కార్ల్‌సన్‌తో తలపడే అవకాశం వచ్చిందని వెల్లడించాడు.

ఈ ఆన్ లైన్ గేమ్ లో బుల్లెట్‌ ఫార్మాట్లో ఒక్క నిమిషంలోనే ఆటగాళ్లు తమ పావులను కదుపుతూ ఉండాలి. అయితే మౌస్‌ తప్పుగా ఉపయోగించడం వల్ల కార్ల్‌సన్‌ క్వీన్‌ను ముందుకు జరిపాడట. దీంతో ముగ్దాకు విజయం సాధించే అవకాశం దక్కిందని నయీమ్‌ చెప్పుకొచ్చాడు.

వాస్తవానికి తాను మాగ్నస్‌ను ఓడించానని ముగ్దా చెబితే మొదట నమ్మలేదని.. కానీ అతడు స్క్రీన్‌ షాట్లు పంపితే నిజమేనని నిర్ధారించుకున్నట్ల కోచ్ వివరించాడు. కాగా, ముగ్దా ప్రస్తుతం బంగ్లా జూనియర్‌ అండర్‌-10 ఛాంపియన్‌గా నిలిచాడు. మూడో తరగతి చదువుతున్నాడు.

Story first published: Tuesday, January 21, 2025, 9:13 [IST]
Other articles published on Jan 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+