Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుక్కలా విసిరేశారు: ఏడ్చేసిన సురెజ్ గ్రాండ్ మదర్

మోంటెవిడియో: ప్రత్యర్థి ఆటగాడు గిర్గియా చిలిని కొరికేసిన లూయిస్ సురెజ్‌కు మద్దతు పెరుగుతూ వస్తోంది. తాజాగా గ్రాండ్ మదర్ అతన్ని బలపరిచింది. ఫిఫా ప్రపంచ కప్ పోటీల్లో అతను ఇటలీ ఆటగాడిని కొరికిన విషయం తెలిసిందే.

దేశాధ్యక్షుడు జోస్ ముజికాతో పాటు ఉరుగ్వే ప్రజలు సురేజ్‌కు మద్దతుగా నిలిచారు. ఈ నెల 26వ తేదీన అతనికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. బ్రెజిల్ నుంచి వచ్చిన అతనికి మోంటేవిడియో విమానాశ్రయంలో దేశాధ్యక్షుడితో పాటు వేయి మంది స్వాగతం పలికారు.

Luis Suarez was 'chucked out like a dog': Grandmother

జూన్ 24వ తేదీన జరిగిన గ్రూప్ డి మ్యాచులో ఇటలీ ఆటగాడు గిర్గియా చిలీని కొరికినందుకు సురెజ్‌పై తొమ్మిది మ్యాచులకు, నాలుగు నెలల పాటు నిషేధం విధించారు. ఆ మ్యాచులో ఉరుగ్వే 1-0 స్కోరుతో గెలిచి నాకవుట్ దశకు చేరుకుంది.

సురేజ్‌పై నిషేధం విధించడం కిరాతకమని అతని గ్రాండ్ మదర్ లీలా పిరిజ్ డా రోజా అన్నారు. ఫిఫా అతన్ని కుక్కలా బయటకు విసిరేసిందని ఆమె వ్యాఖ్యానించారుూ. లూయిస్ విషయంలో ఏం చేశారో అందరికీ తెలుసునని, ప్రపంచ కప్ నుంచి అతన్ని బయటకు పంపించదలిచారని, సరిగ్గా అదే చేశారని, కుక్కలా అతన్ని బయటకు తోసేశారని ఆమె వ్యాఖ్యానించారు.

ఏడ్చేస్తూ ఆమె సురెజ్ సొంత పట్టణం సాల్టోలో ఆ మాటలు అన్నారు. ఉరుగ్వే రౌండ్ 16లో కొలంబియాను ఎదుర్కోనుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+