Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలింపిక్స్ లో 'కిస్ సీన్' : మ్యాచ్ అయ్యాక ప్రపోజ్, ఆ వెంటనే..

రియో డీ జెనీరో : ఒలింపిక్స్ అంటే ఎక్కడైనా వినిపించే మాట ఒక్కటే.. అయితే గేమ్స్ లేదంటే మెడల్స్. అయితే వీటన్నింటికి మించి ఆటలో చోటు చేసుకునే భావోద్వేగాలు కూడా అభిమానులను కట్టిపడేస్తాయి. తాజాగా ఇలాంటి ఘట్టమే ఒలింపిక్స్ క్రీడా సంగ్రామంలో చోటు చేసుకుంది.

రగ్బీ మహిళల విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం.. స్టేడియం మేనేజర్ మర్జోరీ ఎన్యా (28), బ్రెజిల్ రగ్బీ క్రీడాకారిణి ఇసాడోరా సెరులో(25) మధ్య చోటు చేసుకున్న గాఢ చుంబనం అందరిని కట్టిపడేసింది. తొలిసారి జరిగిన మహిళల రగ్బీ గేమ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకోగా.. అనంతరం ఈ ముద్దు సీన్ చోటు చేసుకుంది.

 Love wins: Brazilian women's rugby player gets first Olympic marriage proposal

అయితే ఇసాడోరా మర్జోరీ ఎన్యాకు గర్ల్ ఫ్రెండ్ కావడం గమనార్హం. గత రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మైక్ అందుకుని భావోద్వేగంగా ప్రసంగించిన మర్జోరీ ఎన్యా.. 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని బహిరంగా గానే అడిగేశాడు. దీంతో అతని ప్రేమకు ముగ్దురాలైన ప్రియురాలు ఇసాడోరా.. తక్షణం అతని కౌగిలిలో ఒదిగిపోయి.. తన పెదాలతో అతని పెదాలను లాక్ చేసేసింది.

గేమ్ ను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులు.. ఈ ఘటనను ఆద్యాంతం ఆసాంతంగా తిలకించారు. మొత్తానికి ఒలింపిక్స్ వేదికగా క్రీడాకారుల ప్రతిభ మాత్రమే కాదు, వాళ్ల ప్రేమ వ్యవహారాలు బయటపడుతాయన్న మాట.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+