లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు - కనిపించకుండా పోయిన స్టార్ మహిళా రెజ్లర్!!
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. అస్సలు శాంతించడం లేదు. ఇప్పటికే 24 మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది క్షతగాత్రులయ్యారు. మిలియన్ల కొద్ది ఆస్తుల నష్టం వాటిల్లింది. అయితే ఈ కార్చిచ్చులో మాజీ లేడీ WWE స్టార్ మెలినా కనిపించకుండా పోయారని తెలిసింది. ప్రస్తుతం ఆమె కనపడకుండా పోవడం చర్చనీయాంశమైంది. ఆమెకు ఏమైందో అని అంతా ఆందోళన చెందుతున్నారు
అసలేం జరిగిందంటే?
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో కార్చిచ్చు ఎన్నో ఇళ్లను బుగ్గి చేసింది. దీని కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఆచూకీ తెలియలేదు. తీవ్రమైన గాలులు వీస్తుండటం వల్ల మంటలు ఒక చోట నుంచి మరో చోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లక్షల మంది తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ రెజ్లింగ్ కమ్యునిటీ ఓ షాకింగ్ ట్వీట్ పెట్టింది. రెండు సార్లు WWE Diva ఛాంపియన్ మెలినా నావా పెరెజ్ మిస్ అయినట్లు ట్వీట్ చేసింది. "లాస్ ఏంజెలెస్ ను దహిస్తోన్న కార్చిచ్చు పరిణామాల మధ్య WWE లెజెండ్ మెలినా జాడ తెలీయకపోవడం మాకు బాధ కలిగిస్తోంది. ఎవరైనా ఆమెను చూస్తే, ఆమె గురించి తెలిసినా మాకు సమాచారం ఇవ్వండి ప్లీజ్, థ్యాంక్యూ" అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
అయితే ఈ ట్వీట్ చేసిన తర్వాత కాసేపటికి మరో ట్వీట్ చేసింది రెజ్లింగ్ కమ్యూనిటీ. మెలీనా కాంటాక్ట్ లోకి వచ్చినట్లు పేర్కొంది. ఆమే సేఫ్ గానే ఉన్నట్లు తెలిపింది. తమ ట్వీట్ కు స్పందించి సమాచారం అందించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications