లండన్: ఇంగ్లాండ్ స్టార్ ఫుట్‌బాలర్ నాథనీల్ క్లైన్‌కు చెందిన ఓ సెక్స్ వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఇది అతనికి పెద్ద షాక్. తన లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో దర్శనం ఇవ్వడంతో షాకయ్యాడు.
అతను వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. దీనికి కారణమైన వారి పైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. తన గౌరవానికి భంగం కలిగేలా వీడియో ఉంచారని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఆ వీడియోను ఇంటర్నెట్ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

నథనీల్ క్లైన్ 2014లో తన లగ్జరీ అపార్టుమెంటులో ఓ మహిళతో సెక్స్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో తన మిత్రుడు కూడా అదే గదిలో ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. అతను మెర్సిసైడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.