For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికాకు షాక్

By Nageswara Rao

ఆక్లాండ్:ప్రపంచ కప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచి ఫైనల్లో అడుగు పెట్టింది. న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్లో ప్రవేశించింది. డక్ వర్తలూయిస్ ప్రకారం 43 ఓవర్లలో 298 పరుగుల లక్ష్యం ఉండగా.. దానిని 42.5 ఓవర్లలో కివీస్ చేధించింది. ఎలియాట్ చివరకు సిక్స్ కొట్టి న్యూజిలాండ్‌ను గెలిపించాడు. సౌతాఫ్రికాపై కివీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ జరుగుతున్న మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 298 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు వర్షం కారణంగా అంతరాయ ఏర్పడటంతో 43 ఓవర్లకు గాను 281 పరుగులు చేసింది. దీంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం న్యూజిలాండ్ లక్ష్యాన్ని 298గా నిర్ధారించారు.

న్యూజిలాండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. 43 ఓవర్లలో 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆరు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 42 ఓవర్లు పూర్తయ్యాయి. మరో ఓవర్లో 12 పరుగులు చేయాలి.

LIVE: World Cup Semi-final 1: NZ bowlers win opening exchanges

వర్షం అడ్డంకిగా మారడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్‌ మొత్తం 114 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది. ఆట నిలిచిపోయే సమాయానికి దక్షిణాఫ్రికా 38 ఓవర్లకు గాను 3 వికెట్లను కోల్పోయి 216 పరుగులు చేసింది.

LIVE: World Cup Semi-final 1: NZ bowlers win opening exchanges

విలియమసన్ ఔట్, రెండో వికెట్ డౌన్:

* 81 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమసన్‌ను మోర్నీ మెర్కెల్ పెవిలియన్‌కు పంపాడు.

తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్, మెక్ కల్లమ్ అర్ధ సెంచరీ:

LIVE: World Cup Semi-final 1: NZ bowlers win opening exchanges

* 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెక్ కల్లమ్ ఔట్ అవడంతో న్యూజిలాండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో మెక్ కల్లమ్ అర్ధ సెంచరీని సాధించాడు. వన్డేల్లో అతనికిది 31వ అర్ధ సెంచరీ. ఈ టోర్నమెంట్లో ఇది నాల్గవది.

* దక్షిణాఫ్రికా నిర్దేశించిన 298 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు దాటిగా ఆడుతున్నారు. న్యూజిలాండ్ 5 ఓవర్లకు గాను 71 పరుగులు సాధించింది. మెక్ కల్లమ్ 59, గుప్తిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కివీస్ లక్ష్యం 298 పరుగులు:

LIVE: World Cup Semi-final 1: NZ bowlers win opening exchanges

* 272 పరుగుల వద్ద మిల్లర్ రూపంలో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడని మిల్లర్ 18 బంతుల్లో 49 పరుగులు చేసి అర్ధ సెంచరీని మిస్ అయ్యాడు.

* మ్యాచ్ ప్రారంభమైన అనంతరం 39వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా నాల్గవ వికెట్ కోల్పోయింది. ఆండర్సన్ వేసిని ఈ ఓవర్‌లో 82 వ్యక్తిగత పరుగుల వద్ద డుఫ్లెసిస్ ఔట్ అయ్యాడు. దీంతో 217 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా నాల్గవ వికెట్ కోల్పోయింది. డుఫ్లెసిస్ అనంతరం బ్యాటింక్‌గు మిల్లర్ వచ్చాడు.

43 ఓవర్లకు మ్యాచ్ కుదింపు:

మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా 5 ఓవర్లు ఆడనుంది. స్ధానిక కాలమాన ప్రకారం 11.45 గంటలకు మ్యాచ్ మళ్లీ తిరిగి ప్రారంభమైంది. కివీస్ తొలి పవర్ ప్లేలో 9 ఓవర్లు, బ్యాటింగ్ పవర్ ప్లేలో 4 ఓవర్లు ఆడుతుందని ఐసీసీ అధికారకంగా పేర్కొంది.

LIVE: World Cup Semi-final 1: NZ bowlers win opening exchanges

మ్యాచ్ ఈరోజు జరగపోతే, రేపు నిర్వహిస్తాం: ఐసీసీ

* మంగళవారమే మ్యాచ్‌ను ముగించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉన్నట్లు స్పష్టమవుతోంది. వర్షం ఆగిపోగానే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆట మొదలవుతుంది. పరిస్ధితులు అనుకూలిస్తే మంగళవారమే మ్యాచ్‌ను ముగించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది.

అలా సాధ్యం కాని పక్షంలో బుధవారం రిజర్వ్ రోజులో మ్యాచ్‌ను నిర్వహిస్తామని ఐసీసీ పేర్కొంది. ఆటను మంగళవారమే పూర్తి చేయాలంటే న్యూజిలాండ్‌ కనీసం 20 ఓవర్లు ఆడాలి. అలాంటి సందర్భంలో కివీస్‌ లక్ష్యం 20 ఓవర్లలో 166 పరుగులు అవుతుంది.

వర్షం అడ్డంకి:

* 38వ ఓవర్‌ తర్వాత చిరు జల్లుల పడటంతో మ్యాచ్‌కి అంతరాయం ఏర్పడింది. దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు సాధించింది. మూడో పవర్ ప్లేలో ప్రస్తుతం క్రీజులో ఉన్న ప్లెసిస్, ఏబీ డెవిలియర్స్ 12 పరుగులు సాధించి దక్షిణాఫ్రికాను 216 పరుగులకు చేర్చారు.

LIVE: World Cup Semi-final 1: NZ bowlers win opening exchanges

* సౌధీ ఓవర్‌లో కెప్టెన్ డెవిలియర్స్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పంచుకున్నాడు. 200 పరుగుల్లో ఆఖరి 50 పరుగులు క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాట్స్ మెన్లు 24 బంతుల్లో సాధించారు.

* ఏబీ డెవిలయర్స్ అర్ధ సెంచరీ:

బ్యాటింగ్ పవర్ ప్లే దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా సాగుతోంది. డుప్లెసిస్, ఏబీ డెవిలియర్స్ నిలకడగా రాణిస్తూ 55 బంతుల్లో 69 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. 33 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ద్వారా డెవిలియర్స్ అర్ధ సెంచరీ సాధించాడు. 37 ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 200లకు చేరింది.
* దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. కోరే ఆండర్సన్ వేసిన మొదటి ఓవర్‌లో రోసో కట్ చేయబోయి స్వ్కేర్ లెగ్‌లో ఉన్న గుప్తిల్‌కు క్యాచ్ ఇచ్చి 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు.

* 25వ ఓవర్ మొదటి బంతికి దక్షిణాఫ్రికా, ఇలియట్ బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా వంద పరుగలు మైలు రాయి చేరుకుంది.

LIVE: World Cup Semi-final 1: NZ bowlers win opening exchanges

* రెండో వికెట్ గా డీకాక్ తన వ్యక్తిగత స్కోరు 14 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. పది ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు రెండు వికెట్లు నష్టపోయి 3.9 పరుగుల సరాసరితో 39గాఉంది.

* బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా తన తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనెర్ బ్యాట్స్‌మెన్ ఆమ్లా 10 పరుగులు చేసి బోల్ట్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. సౌతాఫ్రికా ప్రస్తుత స్కోర్ 5 ఓవర్లకుగాను వికెట్ నష్టానికి 26 పరుగులతో ఉంది.

* వరల్డ్ కప్‌లో భాగంగా ఆక్లాండ్‌లో న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.

LIVE: World Cup Semi-final 1: NZ bowlers win opening exchanges

న్యూజిలాండ్:
బ్రెండన్ మెక్‌కలమ్(కెప్టెన్), మార్టిన్ గప్తిల్, కనె విలియమ్‌సన్, రాన్ టేలర్, గ్రాంట్ ఇలియట్, కోరె అండర్సన్, ల్యూక్ రోంచ్, డానియల్ వెటోరి, టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్.

దక్షిణాఫ్రికా:
ఏబీ డివిలియర్స్(కెప్టెన్), హషిమ్ ఆమ్లా, డికాక్, డుప్లెసిస్, రొసో, డేవిడ్ మిల్లర్, జేపీ డుమిని, ఫిలాండర్, డేల్ స్టేయిన్, మోర్నీ మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+