ఇష్టమని, క్యూట్‌గా ఉన్నాడని జైకొడ్తున్నటెన్నిస్ బ్యూటీ!
లండన్: మాజీ ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి అజరెంకా ఫిఫా ప్రపంచ కప్ పోటీల్లో తన సొంత దేశమైన బెలారూస్‌కు మద్దతు పలకడం లేదు! ఆమె అర్జెంటీనా జట్టుకు జై కొడుతోంది. అందుకు ఓ కారణం ఉందట. ఆ జట్టులో స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఉండడమే.
గత మూడు ప్రపంచ కప్‌ల నుండి తన మద్దతు అర్జెంటీనాకేనని మాజీ డబుల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ అజరెంకా చెప్పింది. తాను గత కొంతకాలంగా అర్జెంటీనాకు మద్దతుగా ఆ దేశం షర్ట్‌నే ధరిస్తున్నానని చెప్పింది.

మెస్సీ అంటే తాను పడి చేస్తానని, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్లలో మెస్సీ కూడా ఒకరని ఆమె ఉబ్బితబ్బిబ్బవుతూ చెబుతోంది. అతడు చాలా క్యూట్‌గా ఉంటాడని అజరెంకా వ్యాఖ్యానించింది.
కాగా, విక్టోరియా అజరెంకా (బెలారుస్) సోమవారం వింబుల్డన్‌లో రెండో రౌండ్లో ప్రవేశించింది. ఎనిమిదో సీడ్ అయిన అజరెంక క్రొయేషియాకు చెందిన 6-3, 7-5తో మిర్జన లుసిచ్ బరోనీ పైన గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications