బార్సిలోనా: స్పెయిన్ బార్సిలోనా తరపున ఆడే అర్జెంటైనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి 21 నెలల జైలుశిక్ష పడింది. అంతేగాక, రెండు మిలియన్ యూరోల జరిమానాకు విధించడం జరిగింది.
మూడు సార్లు పన్నుకు సంబంధించిన నేరాలకు పాల్పడినందుకు ఈ శిక్షలు విధించారు. మెస్సీ తండ్రికి కూడా జైలుశిక్ష పడింది. మెస్సీ తండ్రికి 1.5 మిలియన్ యూరోల జరిమానా విధించింది స్పానిష్ కోర్టు.

29ఏళ్ల మెస్సీ ఇటీవలే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. తండ్రీ కొడుకులిద్దరూ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చని, జరిమానా కట్టి శిక్ష తప్పించుకోవచ్చని కూడా తెలుస్తోంది. అంతేగాక, తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవకాశం కూడా ఉంది.