ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన చైనా అమ్మాయి: చరిత్ర సృష్టించిన నా లీ

మహిళల సింగిల్స్ ఫైనల్లో నా లీ 6-4, 7-6 (0)తో ఇటలీకి చెందిన షియవోన్‌పై వరస సెట్లలో గెలుపొందింది. తొలిసెట్ ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న నా లీ డిఫెండింగ్ చాంపియన్‌కు ముచ్చెమటలు పట్టించింది. అయితే ఐదోగేమ్‌లో లభించిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుని 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం తన సర్వీసులు నిలబెట్టుకుని 6-4తో తొలిసెట్‌ను సునాయాసంగా నెగ్గింది. కాగా, తొలిసెట్‌లో ప్రభావం చూపని షియవోన్ రెండో సెట్‌లో గట్టి పోటీనిచ్చింది. దీంతో పాయింట్లు సాధించేందుకు నా లీ కష్టపడాల్సి వచ్చింది.
హోరాహోరీగా సాగిన ఈ సెట్‌లో ఇద్దరూ చెరో బ్రేక్‌పాయింట్ సాధించి సమంగా నిలిచారు. దీంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. ఇక టైబ్రేక్‌లో రెచ్చిపోయిన నా లీ ప్రత్యర్థికి ఒక్కపాయింట్ కూడా దక్కనీయకుండా సెట్‌లో పాటు మ్యాచ్‌నూ గెలుపొంది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications