Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టర్కీ దిగ్గజ వెయిట్‌లిఫ్టర్‌ ‘పాకెట్‌ హెర్క్యూలెస్‌’ కన్నుమూత

Legendary weightlifter 'Pocket Hercules' dies at 50

హైదరాబాద్: ఏడుసార్లు విశ్వవిజేతగా నిలిచి... వరుసగా మూడుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్ అయిన టర్కీ దిగ్గజ వెయిట్‌లిఫ్టర్‌ నైమ్‌ సులేమాన్‌ఒగ్లు అనారోగ్యంతో కన్నుమూశారు. 50 ఏళ్ల సులేమాన్‌ఒగ్లుకు ఇటీవలే కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఈ శస్త్ర చికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నారని వార్తలొచ్చాయి.

అయితే హఠాత్తుగా ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయారు. ఆయన మృతి పట్ల క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. కేవలం 4.8 అడుగుల ఎత్తు ఉండే సులేమాన్‌ఒగ్లును వెయిట్‌లిఫ్టింగ్‌ ప్రపంచంలో 'ద పాకెట్‌ హెర్క్యూలెస్‌'గా పిలుస్తారు. 1988 సియోల్‌ (60 కేజీలు), 1992 బార్సిలోనా (60 కేజీలు), 1996 అట్లాంటా (64 కేజీలు) ఒలింపిక్స్‌ల్లో ఆయన స్వర్ణ పతకాలు గెలిచారు.

తన శరీర బరువుకు 2.5 రెట్లు బరువునెత్తిన తొలి, ఏకైక వెయిట్‌ లిఫ్టర్‌ ఆయనే కావడం విశేషం. 22 ఏళ్లకే 32 ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఆయన 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌ తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌కు వీడ్కోలు పలికారు. ఆయన మృతి పట్ల సోషల్ మీడియాలో అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

Story first published: Sunday, November 19, 2017, 11:08 [IST]
Other articles published on Nov 19, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+