న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా మిస్ స్కాట్లాండ్ విజేత చేతిలో బౌల్డ్ అయ్యాడు. వయస్సులో తన కన్నా 20 ఏళ్ల చిన్నది అయిన జామీ బోవర్స్తో అతను డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
లారాకు బోవర్స్ను మాజీ మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రయికర్ డ్వైట్ యార్క్ పరిచయం చేశాడట. ఎడిన్బర్గ్ న్యూస్ కథనం ప్రకారం - 44 ఏళ్ల లారా, బోవర్స్ డేటింగ్ చేయడానికి ముందు స్నేహితులుగా మెలిగారు.
మొదట్లో తమ సంబంధం గురించి ఎవరికీ చెప్పడం ఇష్టం లేదని, అయితే బ్రియాన్ అంతటా ఆ విషయం చెప్పేస్తున్నాడని బోవర్స్ అన్నట్లు ఎడిన్బర్గ్ న్యూస్ రాసింది. లారా చార్మింగ్, రోమాంటిగ్, ఫన్ అని ఆ భామామణి పొగిడేసింది. ఏం జరుగుతుందో చూద్దామని కూడా ఆమె అన్నది.
లారా ప్రపంచంలోని మేటి క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. అతను పలు రికార్డులు నెలకొల్పాడు. బోవర్స్‌కు ఇప్పుడు 24 ఏళ్ల వయస్సు, ఆమె మోడల్ కూడా. ట్రినిడాడ్‌లో జన్మించిన బోవర్స్ స్కాట్లాండ్లో పెరిగింది.
బోవర్స్తో ప్రేమలో పడిన విషయాన్ని లారా ఎ టూ జడ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. జామీ బోవర్స్ తన గర్ల్ ఫ్రెండ్ అని, అద్భుతమైన మహిళ అని అతను చెప్పాడు.