Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపియల్‌కు దెబ్బ, తమ క్రికెటర్లను వెనక్కి పిలిచిన శ్రీలంక

Tillakaratne Dilshan
కోలంబో: ఐపియల్ 4కు దెబ్బ తగిలింది. క్లబ్‌కు, దేశానికి మధ్య వివాదం తలెత్తింది. ఐపియల్ 4లో ఆడుతున్న తమ ఆటగాళ్లను శ్రీలంక క్రికెట్ వెనక్కి పిలిచింది. వచ్చే నెలలో ఇంగ్లాండు పర్యటన ఉన్నందున శిక్షణ కోసం వెనక్కి రావాలని ఆదేశించింది. వచ్చే నెల నుంచి 63 రోజుల పాటు శ్రీలంక జట్టు ఇంగ్లాండులో మ్యాచులు ఆడాల్సి ఉంది. జాతీయ జట్టుకు తమ ఆటగాళ్లు ఐపియల్ కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీలంక క్రీడా మంత్రి మహిందానంద అల్తుగమాగే అన్నారు. శ్రీలంక జట్టు ప్రాక్టీస్ దెబ్బ తినకుండా తమ ఆటగాళ్లు ఇతర మ్యాచుల్లో ఆడాల్సి ఉంటుందని ఆయన సూచించారు.

ఐపియల్‌లో 11 మంది శ్రీలంక ఆటగాళ్లు పాల్గొంటున్నారు. కుమార్ సంగక్కర దక్కన్ చార్జర్స్ జట్టుకు మహేలా జయవర్ధనే కొచ్చి టస్కర్స్ కేరళ జట్టుకు సారథ్యం కూడా వహిస్తున్నారు. మే 5వ తేదీ లోగా ఆటగాళ్లంతా కొలంబోలో అందుబాటులో ఉండాలని శ్రీలంక క్రికెట్ చైర్మన్ డిఎస్ డీసిల్వా అన్నారు. శ్రీలంక ఆటగాళ్లను వెనక్కి పిలిచిన మాట వాస్తవమేని నిశాంత రణతుంగ చెప్పారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+