న్యూఢిల్లీ: ఓ భూమి కేటాయింపు కేసులో భారత్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జార్ఖండ్ హౌసింగ్ బోర్డు షాక్ ఇచ్చింది. ధోనీకి బోర్డు నోటీసు జారీ చేసింది.
ధోనీకి ప్రభుత్వం హర్మూ హౌసింగ్ కాలనీలో భూమిని కేటాయించింది. ఇది వరకే కేటాయించిన భామికి పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా ఆయన కేటాయించింది.

ఆ భూవివాదం విషయంలో ఇది వరకే ధోనీ వార్తల్లోకి ఎక్కినప్పటికీ ఈ వివాదంలో ఆయనకు నోటీసు జారీ చేయడం ఇదే ప్రథమం. ఈ విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచారు. ఈ విషయంపై మాట్లాడడానికి సీనియర్ అధికారులు ఇష్టపడడం లేదని, మొబైల్ ఫోన్లు స్విచాఫ్ కూడా చేసుకున్నారని జీ న్యూస్ రాసింది.
భూకేటాయింపు సక్రమంగా జరగలేదనేది ప్రధాన ఆరోపణ. పలు కేటాయింపులను హౌసింగ్ బోర్డు ఇప్పటికే రద్దు చేసినట్లు తెలుస్తోంది.