బెంగళూర్: యూరప్‌లో పేరొందిన ఫుట్‌బాల్ లీగ్ టోర్నీ లా లీగా - 2016 రసవత్తరంగా సాగుతున్నది. టోర్నీ అప్పుడే ఆరోవారానికి చేరుకున్నది. ప్రస్తుత చాంపియన్ ఎఫ్‌సి బార్సిలోనా. ఈ లీగ్ టోర్నీలోనే రికార్డు స్థాయిలో విజయాలు సాధించిన రియల్ మాడ్రిడ్ సైతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
శనివారం నుంచి ప్రారంభమయ్యే ఆరో వారం మ్యాచ్‌ల్లో ఎఫ్‌సి బార్సిలోనా స్పోర్టింగ్ గిజోన్‌తో తల పడుతుండగా, కాటలాన్ జెయింట్స్ టాప్‌లో నిలిచేందుకు తమ ప్రత్యర్థి జట్టు రియల్ మాడ్రిడ్‌కు చాన్స్ ఇచ్చింది. రెండు రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌ల్లో విల్లార్రెల్‌తో రియల్ మాడ్రిడ్, అట్లెంటిక్ మాడ్రిడ్‌పై ఎఫ్‌సి బార్సిలోనా మ్యాచ్ డ్రాచేసుకున్నాయి. లాస్ పాల్మాస్‌పై రియల్ టేక్, డెపోర్టివో లా కొరునా జట్టుపై అట్లెంటికో తలపడనున్నాయి.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం నుంచి ప్రారంభమయ్యే లా లీగా టోర్నీ ఆరోవారం షెడ్యూల్ ఇది:
సెప్టెంబర్ 24 (12.15 ఐఎస్‌టి) రియల్ బెటిస్ వర్సెస్ మాలాగా
సెప్టెంబర్ 24 (ఐఎస్‌టి) 4.30: ఈబార్ వర్సెస్ రియల్ సోకైదాడ్
సెప్టెంబర్ 24 (ఐఎస్‌టి) 7.45 పిఎం: స్పోర్టింగ్ జిజోన్ వర్సెస్ ఎఫ్‌సి బార్సిలోనా
సెప్టెంబర్ 24 (ఐఎస్‌టి) 10 పిఎం: అట్లెంటికో బిల్‌బావో వర్సెస్ సెవిల్లా.
సెప్టెంబర్ 25 (ఐఎస్‌టి) 12.15 ఎఎం: లాస్ పాల్మాస్ వర్సెస్ రియల్ మాడ్రిడ్
సెప్టెంబర్ 25 (ఐఎస్‌టి) 3.30 పిఎం: లెగానెస్ వర్సెస్ వాలెంకియా
సెప్టెంబర్ 25 (ఐఎస్‌టి) 7.45 పిఎం: అట్లెంటికో మాడ్రిడ్ వర్సెస్ డెపోర్టివో
సెప్టెంబర్ 25 (ఐఎస్‌టి) 10 పిఎం: విల్లార్రెల్ వర్సెస్ ఒసాసునా
సెప్టెంబర్ 26 (ఐఎస్‌టి) 12.15 ఎఎం: ఇస్పానోల్ వర్సెస్ సెల్టా విగో
సెప్టెంబర్ 27 (ఐఎస్‌టి) 12.12 ఎఎం:అలావెస్ వర్సెస్ గ్రానాడా