మైక్ పట్టి ఇంటర్వ్యూ చేసిన సంగక్కర భార్య
కొలంబో: తన భర్త కుమార్ సంగక్కర అంటే ఏమిటో చాటదలుచుకున్నట్లున్నారు ఆయన భార్య యెహాలి. మైక్ పట్టుకుని ఓ ఆస్ట్రేలియా అభిమానిని ఆమె ఇంటర్వ్యూ చేసింది. తన తుది టెస్టు మ్యాచ్ ఆడడానికి మైదానంలోకి దిగిన సంగక్కరకు పెద్ద యెత్తున అభిమానులు హారతి పట్టారు.
గురువారంనాడు సంగక్కర తన తుది టెస్టు మ్యాచ్ ఆడుతుండగా ఆయన భార్య మైక్ పట్టుకుంది. ఓ టీవీ మైక్ పట్టుకుని తన భర్తకు ఏ విధమైన అభిమానం ఉందో చాటదలుచుకుంది. ఆమె ఓ ఆస్ట్రేలియా అభిమానిని ఇంటర్వ్యూ చేసింది. అయితే, అతని పేరు వెల్లడించలేదు.
అతను సంగక్కరకు వీరాభిమాని. తాను కుమార్‌ను ఎంతగానో ప్రేమిస్తానని, క్రికెట్ క్రీడారంగంలో ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప వ్యక్తి అని, తాను శ్రీలంక క్రికెట్‌కు మద్దతు ఇస్తానని అతను చెప్పాడు. అయితే, తనను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఎవరో అతనికి తెలియదు.

కుమార్ సంగక్కర రిటైర్ అయ్యే ఈరోజు దుర్దినమని, అతని గొప్ప ఇన్నింగ్సును ఎల్లవేళలా గుర్తుంచుకుంటామని ఆ వీరాభిమాని చె్పపారు. ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపు ఏ మాత్రం చలనం లేకుండా యెహాలి కనిపించారు.
ఇంటర్వ్యూ ముగిసే సమయంలో ఆమె బిగ్గరగా నవ్వేసి, తాను సంగక్కర భార్యనని అతనికి చెప్పేసింది. "నేను ఆయన భార్యనని మీకు తెలుసా, సంగక్కరపై మంచి మాటలు చెప్పినందుకు కృతజ్ఞతలు" అంటూ ఆమె ఇంటర్వ్యూను ముగించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications