న్యూఢిల్లీ: కౌంటీ క్రికెట్ ఆడేందుకు లండన్‌కు వెళ్లిన శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర లండన్ ఎయిర్ పోర్టులో అవమాకర పరిస్ధితిని ఎదుర్కొన్నానని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో వెల్లడించారు. లండన్ ఎయిర్ పోర్టులోని ఓ ఇమ్మిగ్రేషన్ అధికారి తన రంగు పట్ల వివక్ష ప్రదర్శించాడని ఆరోపించాడు.
కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు కుమార సంగక్కర లండన్‌కు చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

కుమార సంగక్కర తన ట్విట్టర్‌లో గత 15 సంవత్సరాలుగా కౌంటీ క్రికెట్ ఆడేందుకు లండన్‌కు వస్తున్నాను. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఎయిర్ పోర్టు అధికారుల నుంచి తొలి సారి తాను వివక్షను ఎదుర్కొన్నానని ట్వీట్ చేశాడు.
'గత 15 ఏళ్లుగా లండన్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాను. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితి ఎదురుకాలేదు. రంగు, మతం ప్రతిష్టదేముంది. ప్రతి ఒక్క ప్రయాణికుడికి మర్యాదివ్వాలి. తనికీలు పక్కాగా ఉండాలి, కాదనను. అవతలి వ్యక్తులు కనీస సభ్యత, సంస్కారం ప్రదర్శించాలని మనం ఆశించడంలో తప్పు లేదు' అని పోస్ట్ చేశాడు.