బెంగళూరు: కర్నాటక ప్రీమియర్ లీగ్ (కెపిఎల్) 2015 టోర్నమెంటులో తన జట్టు మైసూర్ వారియర్స్ తరఫున ఆడేందుకు ఆ అబ్బాయికి చివరి నిమిషం దాకా అవకాశం రాలేదు. చివర్లో వచ్చిన అవకాశంతో.. ఏకంగా రికార్డులు సృష్టించాడు.
సెప్టెంబర్ 17వ తేదీన శ్రీకంఠదత్త నరసింహ రాజ వడియార్ స్టేడియంలో 15 ఏళ్ల బాలుడు కెపిఎల్ చరిత్రలో రికార్డులు సృష్టించాడు. అతను తన హోం టౌన్ మైసూరులో రికార్డులు నెలకొల్పాడు.
మైసూరు వారియర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి ఇంటి దారి పట్టింది. అయితే, చివరి మ్యాచ్ రాక్‌స్టార్స్‌తో ఉంది. ఇంటికి దారి పట్టినప్పటికీ చివరి మ్యాచ్ పరువుకు సంబంధించింది.
ఈ టోర్నమెంటులో 15 ఏళ్ల బాలుడు ఎస్‌జే నికిన్ జోస్ ఆడలేదు. అయితే, సెప్టెంబర్ 17వ తేదీన హఠాత్తుగా అతనికి చివరి మ్యాచుకు పిలుపు వచ్చింది. అయితే, ఇదే మ్యాచ్ అతనికి మరువలేని జ్ఞాపకాలు మిగిల్చింది.
ఇతను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్థి జట్టు రాక్ స్టార్స్ పైన ఆరు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ గురువారం రాత్రి జరిగింది. మైసూర్ వారియర్స్ డిఫెండింగ్ ఛాంపియన్. ఇంటి దారి పట్టింది. అయితే, చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకొని ఇంటిదారి పట్టింది.

ఎస్‌జే నికిన్ తీసిన వికెట్లు మైసూర్ వారియర్‌ను గెలిపించాయి. ఇతను 3.2 ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చి, 6 వికెట్లు తీశాడు. ఇది కెబిఎల్ చరిత్రలోనే బెస్ట్ బౌలింగ్ రికార్డ్. అతను వేసిన 20 బంతుల్లో 14 డాట్ బాల్స్. ఎస్‌జే నికిన్ దూకుడు కారణంగా వారియర్స్ 75 పరుగుల తేడాతో రాక్ స్టార్స్ పైన గెలిచింది.
అంతకుముందు బ్యాట్‌తోను సత్తా చాటాడు. 18 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇతనిని మైసూర్ వారియర్స్ రూ.10,000కు కొనుగోలు చేసింది. ఇతను బ్యాటింగ్‌తో సుపరిచితుడు. కానీ, గురువారం బౌలింగ్‌లో దుమ్ము రేపాడు.
ఎవరీ ఎస్‌జే నికిన్ జోస్?
ఎస్‌జే నికిన్ జోస్... మైసూరులోని విజయనగర్‌లో గల సెయింట్ జోసెప్స్ సెంట్రల్ స్కూల్లో చదువుతున్నాడు. ఇతను కర్నాటక అండర్ -16కు విజయ మర్చంట్ ట్రోఫీలో సారథిగా వ్యవహరించాడు. బెంగళూరులో ఇతను జవహర్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున ఆడాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో కర్నాటక అండర్ 19కు (ఇంటర్ జోనల్ వినూ మన్కడ్ ట్రోఫఈ వన్డే టోర్నమెంట్, సౌత్ జోన్)కు ఎంపికయ్యాడు.