For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోనేరు హంపి చెక్ పెట్టిందంటే..: కొత్త చరిత్ర సృష్టించిన రారాణి

Koneru Humpy: భారత్‌కు చెందిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి కొత్త చరిత్ర సృష్టించింది. తన కేరీర్‌లో మరో బిగ్గెస్ట్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చదరంగపు ఆటలో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంది. చెక్ పెడితే ఎంతటి వారైనా తలవంచక తప్పదని చాటి చెప్పింది.

తాజాగా ర్యాపిడ్ ఛెస్ టోర్నమెంట్ టైటిల్‌ను గెలిచింది కోనేరు హంపి. అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో జయకేతనం ఎగురవేసింది. ఇండోనేషియాకు చెందిన ఇరెనె సుకందర్‌ను మట్టికరిపించింది. నల్లపావులతో ఆడిన హంపి ధాటికి 11వ రౌండ్‌లో చేతులెత్తేసింది సుకందర్.

Koneru Humpy wins Rapid Chess World 2024 title against Irene Sukandar

ఇంటర్నేషనల్ ఛెస్ ఫెడరేషన్ నిర్వహించిన ఈ టోర్నమెంట్ టైటిల్‌ను నెగ్గడం హంపి కేరీర్‌లో ఇది రెండోసారి. ఇదివరకు 2019లో మాస్కోలో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ ఛెస్ టోర్నమెంట్‌లో విజయం సాధించిందామె. మొత్తం ఆరు మంది- జు వెన్ఝుమ్, కేథరినా లాగ్నో, ద్రోణవల్లి హారిక, అఫ్రుజ్ ఖమ్దమోవ, టాన్ ఝొంగ్యి.. ఈ టైటిల్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్ రౌండ్ వరకూ వచ్చారు.

సగటున 8.5 పాయింట్లతో ఫైనల్స్ ఆడే అర్హతను సాధించింది హంపి. సుకందర్‌ను ఢీకొట్టింది. 11వ రౌండ్‌లో ఆటను ముగించింది. ఈ రౌండ్‌లో ఇక ముందుకు వెళ్లలేకపోయింది సుకందర్. ఓటమిని అంగీకరించింది. దీనితో ర్యాపిడ్ ఛెస్ టోర్నమెంట్‌ టైటిల్‌ను రెండోసారి సొంతం చేసుకుందామె. ఈ ఏడాదే గుకేష్ గ్రాండ్ మాస్టర్ హోదాను సాధించిన విషయం తెలిసిందే.

పురుషుల విభాగంలో రష్యాకు చెందిన వొలొదర్ అర్టురోవిచ్ ముర్జిన్ ఈ టైటిల్ గెలిచాడు. 18 సంవత్సరాల వయస్సులోనే ఈ టైటిల్‌ను అందుకున్న రెండో గ్రాండ్ మాస్టర్ అతడే. ఇదివరకు నొబిర్‌బెక్ అబ్డుసట్టొరొవ్ 17 సంవత్సరాల వయస్సులో ర్యాపిడ్ ఛెస్ టైటిల్ నెగ్గాడు.

Story first published: Sunday, December 29, 2024, 9:39 [IST]
Other articles published on Dec 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+