ముంబై: ఒక్క ఫలితం ఐపీఎల్ 8 లీగ్ దశలో నెంబర్ వన్ జట్టును తేల్చింది. ఇంకో ఫలితం రెండు జట్లను ప్లే ఆఫ్‌కు చేర్చింది. మరో జట్టును ఇంటి ముఖం పట్టించింది. శుక్రవారం నాటి వరకు ప్లే ఆఫ్ రేసులో ఆరు జట్లు ఉన్నాయి. శనివారం నాడు జరిగిన రెండు మ్యాచులతో ఒకటి మినహా దాదాపు అంతా తేలిపోయింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ప్లే ఆఫ్‌కు చేరింది. ఆ తర్వాత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. తద్వారా అది కూడా ప్లే ఆఫ్‌కు చేరింది. ఈ రెండు మ్యాచుల వల్ల ప్లే ఆఫ్ రేసులోని నాలుగింటిలో... మూడు ఏవో తేలిపోయింది.
ప్లే ఆఫ్‌కు చెన్నై, రాజస్థాన్ జట్లు చేరాయి. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప బెంగళూరు కూడా ప్లే ఆఫ్‌కు దాదాపు చేరినట్లే. ఆదివారం నాడు బెంగళూరు - ఢిల్లీ మధ్య మ్యాచ్ ఉంది. ఆ తర్వాత ముంబై - హైదరాబాద్ మధ్య ఉంది.

బెంగళూరు - ఢిల్లీ మ్యాచులో.. బెంగళూరు గెలిస్తే రాజమార్గంలో ప్లే ఆఫ్ చేరుతుంది. ఓడితే మాత్రం భారీ పరుగుల తేడాతో ఓడితేనే అది ప్లే ఆఫ్‌కు దూరమవుతుంది. దాదాపు 130 పరుగుల తేడాతో ఓడితేనే బెంగళూరు ప్లే ఆఫ్‌కు దూరమవుతుంది. కానీ అది దాదాపు జరగకపోవచ్చు.
నాలుగో బెర్త్ కోసం కోల్‌కతా, ముంబై, హైదరాబాదులు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ - బెంగళూరు మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ 130 పరుగుల భారీ తేడాతో ఢిల్లీ చేతిలో ఓడితే.. కోల్‌కతాకు ప్లే ఆఫ్ మార్గం సుగమం అవుతుంది. అలాకాకుండా, హైదరాబాద్ - ముంబై మ్యాచ్ రద్దయినా కోల్‌కతాకు మార్గం సుగమం అవుతుంది.
ఈ రెండు కాకుండా కోల్‌కతాకు ప్లే ఆఫ్ చేరేందుకు మరో అవకాశం లేదనే చెప్పవచ్చు. చెన్నై, రాజస్థాన్‌లు ప్లే ఆఫ్‌కు చేరాయి.
బెంగళూరు గెలిచినా, స్వల్ప తేడాతో ఓడినా.. ప్లేఆఫ్‌కు చేరిన మూడో జట్టు అవుతుంది. భారీ తేడాతో ఓడితే మాత్రం కోల్‌కతా ప్లే ఆఫ్ చేరుతుంది. ఇక హైదరాబాద్, ముంబైలలో గెలిచిన జట్టు ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. మ్యాచ్ రద్దయితే.. ఈ రెండు జట్లు కాకుండా కోల్‌కతాకు అవకాశముంటుంది. ప్రస్తుతం తమ జట్టు సస్పెన్స్‌లో ఉందని కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్ అన్నాడు.