డెక్కన్ చార్జర్స్‌కు మరో ఓటమి, అదరగొట్టిన యూసుఫ్ పఠాన్

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఛార్జర్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు. ఐదు ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ పడకపోయినా ఛార్జర్స్ స్కోరు 38 పరుగులే. ఇక్బాల్ అబ్దుల్లా మూడో బంతికి సన్నీ సోహల్ (26; 20 బంతుల్లో 3X4)ను ఔట్ చేశాడు, ఐదో బంతికి కెప్టెన్ సంగక్కరను బోల్తాకొట్టించాడు. 41 పరుగుల వద్ద ఛార్జర్స్ రెండు వికెట్లు కోల్పోయింది. 11వ ఓవర్లో మరో రెండు ఝలక్‌లతో ఛార్జర్స్ ఓటమి అప్పుడే ఖరారైంది. రజత్ భాటియా బౌలింగ్‌లో మొదటి బంతికి వైట్ (13) క్లీన్‌బౌల్డ్ కాగా, క్రిస్టియన్ (1) వికెట్ల ముందు దొరికిపోయాడు. శిఖర్ ధావన్ (54; 45 బంతుల్లో 4X4, 1X6), రవితేజ (30; 22 బంతుల్లో 3X4) కొద్దిసేపు కోల్‌కత బౌలర్లను ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 56 పరుగులు జోడించాక బ్రెట్ లీ బౌలింగ్‌లో రవితేజ, కలిస్ బౌలింగ్‌లో ధావన్ క్లీన్‌బౌల్డ్ అయ్యారు.
బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఫీల్డింగ్ వైఫల్యాలు ఛార్జర్స్‌ను మూల్యం చెల్లించుకునేలా చేశాయి. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్‌కత స్కోరు 100కు చేరడానికి 14.3 ఓవర్లు అవసరమయ్యాయి. కానీ ఆఖర్లో స్కోరు బాగా పెరిగింది. సారథి గంభీర్ (35; 22 బంతుల్లో 3X4, 1X6) ఔటయ్యే సమయానికి కోల్‌కత స్కోరు 11.4 ఓవర్లలో 84/3. చివరి 8 ఓవర్లలో కోల్‌కత చేసిన పరుగులు 85. అందులో యూసుఫ్ పఠాన్, మనోజ్ తివారీ (33; 28 బంతుల్లో 3X4, 1X6)ల భాగస్వామ్యం కంటే ఛార్జర్స్ వైఫల్యమే అధికం. ప్రమాదకర బ్యాట్స్‌మన్ పఠాన్ అందించిన మూడు క్యాచ్‌లను నేలపాలు చేశారు. ఓజా బౌలింగ్‌లో మిశ్రా, మిశ్రా బౌలింగ్‌లో క్రిస్టియన్, ఇషాంత్ బౌలింగ్‌లో ధావన్ క్యాచ్‌లు వదిలేశారు. మరోవైపు మంచి భాగస్వామ్యాలు కోల్‌కత భారీస్కోరుకు బాటలు వేశాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications