ఉప్పల్‌లో అక్లాండ్‌పై నైట్ రైడర్స్ ఉత్కంఠ గెలుపు

బ్యాటింగ్‌లో రాణించిన కోల్‌కతా బ్యాట్స్‌మన్ బిస్లా (45)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డు లభించింది. 122 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆక్లాండ్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గుప్తిల్ (0) తొలి బంతికే రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత ఆడమ్స్, విన్సెంట్‌లు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. అద్భుత బ్యాటింగ్ చేసిన విన్సెంట్ 37 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 40 పరుగులు చేసి రనౌటయ్యాడు. తర్వా త వరుసా బంతు లకు ఆడమ్స్ (18), క్యూని (0)లను పఠాన్ పెవిలియ న్ చేర్చాడు. దీంతో ఆక్లాండ్ 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పో యింది.
తర్వాత పుంజుకు న్న నైట్‌రైడర్స్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్లకు పరుగులు తీయకుండా ఆడ్డుకున్నారు. చివర్లో మిల్స్ (19) నాటౌట్‌గా క్రీజులో నిల్చిన జట్టును విజయం అందించలేక పోయాడు. నైట్ రైడర్స్ బౌలర్లలో పఠాన్ రెండు, భాటియా, కలిస్‌లు చెరో వికెట్ పడగొట్టారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్‌లో ఓపెనర్ బిస్లా 32 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 45 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కలిస్ (33) పరుగులు చేసి వెనుదిరిగాడు. యూసుఫ్ పఠాన్ (12) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్లలో ఎవ్వరూ కూడా పెద్ద స్కోరును నమోదు చేయలేక పోవడంతో నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 121/6 పరుగులు మాత్రమే చేయగలిగింది.
స్కోరుబోర్డు:
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్: బిస్లా (సి) గుప్తిల్ (బి) బెట్స్ 45, కలిస్ (సి) క్యూని (బి) మిల్స్ 33, యూసుఫ్ పఠాన్ (బి) ఆడమ్స్ 12, మనోజ్ తివారి (బి) మిల్స్ 1, టెన్ డొయోస్చెట్ (రనౌట్) 3, సాకిబ్ అల్ హసన్ (రనౌట్) 4, రజత్ భాటియా (నాటౌట్) 10, గోస్వామి (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు.
బౌలింగ్: మిల్స్ 4-0-24-2, మార్టిన్ 4-0-27-0, బెట్స్ 4-0-13-1, ఆడమ్స్ 4-0-22-1, హీరా 40-31-0.
ఆక్లాండ్ ఇన్నింగ్స్: ఆడమ్స్ (సి) అండ్ (బి) పఠాన్ 18, గుప్తిల్ (రనౌట్) 0, విన్సెంట్ (రనౌట్) 40, క్యూని (సి) అండ్ (బి) పఠాన్ 0, హోప్‌కిన్స్ (సి) కలిస్ (బి) భాటియా 10, మున్రో (బి) కలిస్ 20, మిల్స్ (నాటౌట్) 19, ఆడమ్స్ (నాటౌట్) 9, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం 20 ఓవర్లలో 119/6.
బౌలింగ్: ఇక్భాల్ అబ్దుల్లా 4-0-20-0, బ్రెట్ లీ 4-0-27-0, ఉనాద్కత్ 1-0-14-0, యూసుఫ్ పఠాన్ 4-0-21-2, రజత్ భాటియా 4-0-14-1, సాకిబ్ 2-0-11-0, కలిస్ 1-0-11-1.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications