గంభీర్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ జోరుకు బ్రేక్, కోచి టస్కర్స్ చేతిలో ఓటమి

కలిస్ (45; 41 బంతుల్లో 5X4), మోర్గాన్ రాణించడంతో కోల్‌కత 10 ఓవర్లలో 69/0తో సాఫీగా లక్ష్యం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. గెలుపు కష్టం కాదనిపించింది. కానీ 11వ ఓవర్లో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, స్వేచ్ఛగా ఆడకుండా బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకున్న గోమెజ్ ఓ లెగ్ కటర్‌తో కలిస్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాతి బంతికే గంభీర్ క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా గోమెజ్ (2/14) బౌలింగ్‌లో పరుగులు చేయడం బ్యాట్స్‌మెన్‌కు కష్టమైంది. మరోవైపు మనోజ్ తివారీ (1) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. క్రమంగా పరుగుల వేగం తగ్గింది. చివరి 5 ఓవర్లలో 57 పరుగులు చేయాల్సిన పరిస్థితి. హార్డ్ హిట్టర్లు మోర్గాన్, యూసుఫ్ పఠాన్ (17; 13 బంతుల్లో 2X4) క్రీజులో ఉండడంతో అప్పటికీ కోల్‌కతకు అవకాశాలున్నాయి. కానీ ప్రశాంత్ పరమేశ్వరన్ (0/21), వినయ్ కుమార్ (2/28), ఆర్పీ సింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వారికి కళ్లెం వేశారు. భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వలేదు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోచి రెండో ఓవర్లోనే బ్రెండన్ మెక్‌కలమ్ (1) వికెట్ కోల్పోయింది. ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు 35/2. ఐతే జయవర్దనే జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. క్లింగర్ (29)తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరూ చకచకా సింగిల్స్ తీస్తూ వీలైనప్పుడు బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ఐతే 12వ ఓవర్లో క్లింగర్ ఔట్ కావడంతో 51 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే రవీంద్ర జడేజా వెనుతిరిగాడు. 16 ఓవర్లకు కోచి స్కోరు 102 మాత్రమే. ఐతే హాడ్జ్ అనూహ్యంగా రెచ్చిపోవడంతో కోచి చివరి 4 ఓవర్లలో 54 పరుగులు పిండుకుంది. 17వ ఓవర్లో సిక్స్ కొట్టిన జయవర్దనే.. 19వ ఓవర్లో ఔటయ్యాడు. హాడ్జ్ వరుసగా 6 4 6 4 బాదడంతో బ్రెట్ లీ వేసిన చివరి ఓవర్లో 22 పరుగులొచ్చాయి. ఇదే మ్యాచ్‌ను మలుపు తిప్పుతుందని కోల్‌కత ఊహించలేకపోయింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications