For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియా కోచ్‌గా గుడ్‌బై, దక్షిణాఫ్రికా జట్టు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్?

By Pratap
Gary Kirsten
ముంబై: ప్రపంచ కప్ పోటీల్లో టీమిండియాను విజయం దిశగా నడిపించిన గ్యారీ కిర్‌స్టన్ భారత జట్టు కోచ్‌గా తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. తదుపరి ఆయన తన సొంత దేశం దక్షిణాఫ్రికా జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోచ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాలని తనను క్రికెట్ సౌతాఫ్రికా అడిగిందని, అయితే తాను ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని కిర్‌స్టన్ బిబిసి రేడియోతో చెప్పారు.

సౌతాఫ్రికా క్రికెట్ తనను అడిగితే తాను ఇప్పుడే ఏ నిర్ణయమూ తీసుకోలేనని చెప్పినట్లు ఆయన తెలిపారు. తనకు కొంత సమయం అవసరమని, అద్భుతమైన ప్రస్తుత ప్రయాణం తర్వాత స్పష్టత కోసం తాను ఆలోచన చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత యువ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా కిర్‌స్టన్‌ను తమ భుజాలపై ఎత్తుకుని ముంబైలోని వాంఖడే మైదానం చుట్టూ తిప్పారు. కిర్‌స్టన్ మార్గదర్శకత్వంలో ఇండియా టెస్టుల్లో 2009 నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది. ఇప్పటికీ ఆ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+