రియో డీ జెనిరో: రియో ఒలింపిక్స్‌లో ఓ క్రీడాకారుడిని చూసి ప్రేక్షకులు కామెంట్ చేశారు. అతనిని కించపరిచేలా వ్యవహరించారు. ఇథియోపియా స్విమ్మర్ రాబెల్ కిరోస్ పురుషుల 100 మీ. ఫ్రీస్టైల్‌లో బరిలో నిలిచాడు.

ప్రీస్టైల్ హీట్స్ జరుగుతుండగా ప్రేక్షకులు అతని శరీర ఆకృతిని చూసిన ప్రేక్షకులు.. వెక్కిరించారు. ఇథియోపియాకి చెందిన న్యూస్ సైట్ కూడా అతని ఆకారాన్ని కామెంట్ చేసింది. కాగా, రాబెల్ ఇథియోపియా స్విమ్మింగ్ ఫెడరేషన్ అధ్యక్షుని కుమారుడు.
ఒకే రోజు రెండు రికార్డులు తిరగరాసింది
ఆస్ట్రేలియాకు చెందిన కేట్ క్యాంప్‌బెల్ మహిళల 100 మీ. స్విమ్మింగ్ ఫ్రీస్టైల్‌లో రెండుసార్లు ఒలింపిక్ రికార్డును బద్దలుకొట్టింది. అర్హత కోసం జరుగుతున్న హీట్ 5 పోటీల్లో తొలుత లక్ష్యాన్ని 52.78 సెకన్లలో పూర్తి చేసింది. ఇది సరికొత్త ఒలింపిక్ రికార్డు. కొద్ది సేపటికే జరిగిన సెమీ ఫైనల్స్‌లో 52.71 సెకన్ల టైమింగ్‌తో తన రికార్డును తానే తిరగరాసింది. దీంతో క్యాంపుబెల్‌కు ఫైనల్స్‌లో బెర్తు ఖరారైంది.