Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నోటికి ప్లాస్టర్‌తోను పొలార్డ్ వాగ్వాదం: తప్పు చేస్తే అంగీకరిస్తా!

బెంగళూరు: ముంబై ఇండియన్స్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ తన మూతికి టేప్ అంటించుకొని నిరసన తెలపడమే కాకుండా.. దాంతోనే అతను ఎంపైర్‌తో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. మ్యాచ్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ గేల్‌తో పొలార్డ్ వాగ్వాదానికి దిగాడు. ఎంపైర్లు అతనిని మందలించారు.

దీంతో డగౌడ్‌కు వెళ్లిన పొలార్డ్ నోటికి ప్లాస్టర్ అంటించుకొని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ప్లాస్టర్ అంటించుకొని వచ్చిన పొలార్డ్ ఆ తర్వాత కూడా అంపైర్ వినీత్ కులకర్ణితో వాగ్వాదానికి దిగాడు. కాగా, పొలార్డ్ తీరును ముంబై మరో ప్లేయర్ హర్భజన్ సింగ్ సమర్థించాడు.

Kieron Pollard mocks gag order, hits back at umpires with sellotape

తన నిరసన పైన పొలార్డ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు కూడా. దీనిని మీడియా స్టోరీలా చేసుకోవద్దని, తాను తప్పు చేస్తే అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కానీ, అనవసరంగా తనను వార్తల్లోకి ఎక్కించవద్దని కోరారు.

తాను క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నానని, తాను తన జట్టును గెలిపించేందుకు కృషి చేస్తున్నానని, తాను వంద శాతం ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. బెంగళూరు పైన ముంబై గెలిచిన అంశంపై స్పందిస్తూ.. గెలిచినందుకు శుభాకాంక్షలు అని, తమ గెలుపు ప్రారంభమైందని చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+