Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

థ్రిల్లర్ సినిమాలా: అథ్లెట్‌ను నగ్నంగా బంధించి మద్యం తాగాలంటూ బలవంతం!

Kidnapped triathlete says she sweet-talked captor into letting her go

హైదరాబాద్: ఓ అథ్లెట్‌ను కిడ్నాప్‌ చేసి నగ్నంగా బంధించినా ఆమె చాకచక్యంగా బయటపడిన ఘటన ఆస్ట్రియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... నటాలీ బిర్లీ ఓ ట్రయాథ్లెట్‌. ప్రతి రోజూలాగే తన రెగ్యులర్‌ కార్యక్రమల్లో భాగంగా సైకిల్‌పై ప్రాక్టీస్‌ కొనసాగిస్తోంది. ఇంతలో హఠాత్తుగా వెనకనుంచి వచ్చిన ఓ కారు ఆమె సైకిల్‌ను ఢీకొంది.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ఈ క్రమంలో కింద పడిన ఆమెకు గాయాలయ్యాయి. తేరుకునే లోపే కారు డ్రైవర్‌ ఓ కర్రతో ఆమె తలపై మోదాడు. అనంతరం స్పృహ కోల్పోయిన ఆమెను కారు వెనక సీటులోకి లాగి పడేశాడు. కొంత సేపటి తర్వాత ఆమె కళ్లు తెరిచి చూస్తే నగ్నంగా ఉండడమే కాకుండా ఓ కుర్చీకి కట్టేసి ఉంది.

కత్తితో బెదిరిస్తూ మద్యం తాగాలంటూ

కత్తితో బెదిరిస్తూ మద్యం తాగాలంటూ

తీవ్ర ఆగ్రహంతో ఉన్న అతడు కత్తితో బెదిరిస్తూ మద్యం తాగాలంటూ ఆమెను బలవంతం చేయబోయాడు. అయితే, ఆమె వినకపోవడంతో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపాలని ప్రయత్నించాడు. తిరిగి ఆ ప్రయత్నం విరమించుకుని బాత్‌ టబ్‌లో ముంచాలని లాక్కెళ్లాడు.

అదుపు తప్పుతున్నదని గ్రహించిన నటాలీ

అదుపు తప్పుతున్నదని గ్రహించిన నటాలీ

దీంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతున్నదని గ్రహించిన నటాలీ ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని భావించింది. ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చే క్రమంలో అక్కడ చాలా ఆర్చిడ్‌ పూల మొక్కలను ఆమె గమనించింది. తనకు కూడా ఆ పూలంటే ఎంతో ఇష్టమంటూ అతడిని మెల్లిగా మాటల్లోకి దించింది.

తానో తోటమాలినని, తండ్రి చనిపోగా

తానో తోటమాలినని, తండ్రి చనిపోగా

దీంతో అతడు కూడా నటాలీతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. తానో తోటమాలినని, తండ్రి చనిపోగా తల్లి మద్యానికి బానిసయ్యిందని తన జీవితం గురించి చెప్పుకొచ్చాడు. అదేవిధంగా తన ప్రియురాలు చేసిన మోసం కూడా లోకంపై కసిని పెంచిందని ఆమెతో అన్నాడు. దీంతో ఆమె తెలివిగా వ్వవహారించి అతడితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

కిడ్నాపర్‌తో ఒప్పందం చేసుకున్న నటాలీ

కిడ్నాపర్‌తో ఒప్పందం చేసుకున్న నటాలీ

ఆ ఒప్పందం ప్రకారం తనను వదిలేస్తే అందరికీ యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలాయని చెబుతానని తెలిపింది. దీనికి అంగీకరించిన అతడు స్వయంగా కారులో ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయాడు. అయితే, నటాలీ మాత్రం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 33 ఏళ్ల ఆ కిడ్నాపర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

Story first published: Monday, July 29, 2019, 12:49 [IST]
Other articles published on Jul 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+