For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖోఖో ప్రపంచకప్‌ - రఫ్ఫాడించిన భారత జట్లు

ఖోఖో ప్రపంచ కప్‌ తొలి ఎడిషన్ లోనే ఆతిథ్య భారత్‌ అదరి ప్రదర్శన చేస్తోంది. గ్రామీణ క్రీడల్లో తమకు తిరుగులేదని నిరూపిస్తూ... ఈ మెగాటోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్ కు దూసుకెళ్లాయి. టైటిల్‌ ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచాయి.

ఈ ఖోఖో వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా జరిగిన వేర్వేరు సెమీ ఫైనల్ మ్యాచుల్లో భారత మెన్స్, ఉమెన్స్ టీమ్ అదిరే ప్రదర్శన చేశాయి. ఆఖరి వరకు హోరా హోరీగా, ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో మన ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. పురుషుల సెమీస్‌లో భారత్‌ జట్టు 62-42తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. భారత అమ్మాయిల జట్టు 66-16తో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.

Kho Kho World Cup Final Indian Men And Womens Teams enters Into final match

పురుషుల విభాగం సెమీస్‌లో భారత జట్టు ఒక దశలో 28-42తో వెనుకబడింది. అయినా ఆ తర్వాత గొప్పగా పుంజుకుని విజయాన్ని దక్కించుకుంది. ఇంకో సెమీస్‌లో నేపాల్‌ 72-20తో ఇరాన్‌పై గెలిచింది. దీంతో ఫైనల్లో నేపాల్‌తో భారత్‌ తలపడనుంది.

మహిళల విభాగం సెమీస్ లో భారత జట్టు ఆరంభం నుంచి దూకుడుగా ఆడి 38-16తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించి ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. జట్టు విజయంలో నిర్మలా భాటి, నాజియా, వైష్ణవి, నస్రీన్‌ షేక్, బిలార్‌ దేవి కీలకంగా వ్యవహరించారు. మరో సెమీస్‌లో నేపాల్‌ 89-18 తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. దీంతో తుది పోరులో నేపాల్‌తో భారత్‌ ఢీ కొట్టబోతుంది.

Story first published: Sunday, January 19, 2025, 9:54 [IST]
Other articles published on Jan 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+