ఖోఖో ప్రపంచ కప్ తొలి ఎడిషన్ లో ఆతిథ్య భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్రామీణ క్రీడ ఖోఖో వరల్డ్ కప్ టోర్నీలో అదిరే ప్రదర్శన చేసింది. అటు పురుషుల విభాగంలో, ఇటు మహిళల విభాగాంలో రెండింటిలోనూ విజేతగా అవతరించింది.
మోదీ ప్రశంసలు
ఈ ఖోఖో ప్రపంచ కప్ సొంతం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత జట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా అభినందించారు. ఈ విజయం యువతరానికి స్ఫూర్తిని ఇస్తుందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Congratulations to the Indian women’s team on winning the first-ever Kho Kho World Cup! This historic victory is a result of their unparalleled skill, determination and teamwork.
— Narendra Modi (@narendramodi) January 19, 2025
This triumph has brought more spotlight to one of India’s oldest traditional sports, inspiring… pic.twitter.com/5lMftjZB5Z
అమ్మాయిల దూకుడు
మహిళల ఫైనల్లో భారత జట్టు 78-40తో నేపాల్‌ను ఓడించింది. ఆట ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన మన అమ్మాయిలు.. చివరి వరకు జోరు ప్రదర్శించారు. కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే, వైష్ణవి మంచిగా రాణించడం వల్ల ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Today’s a great day for Indian Kho Kho.
— Narendra Modi (@narendramodi) January 19, 2025
Incredibly proud of Indian Men's Kho Kho team for winning the Kho Kho World Cup title. Their grit and dedication is commendable. This win will contribute to further popularising Kho Kho among the youth. pic.twitter.com/OvzUV6SpX0
మొదటి నుంచే ఎటాకింగ్ గేమ్
పురుషుల విభాగంలో భారత జట్టు 54-36తో నేపాల్‌పై గెలుపొందింది. ప్రారంభంలోనే ఎటాకింగ్ గేమ్ ఆడిన భారత జట్టు 26-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత నేపాల్ కాస్త ప్రతిఘటించింది. అయినా దూకుడు కొనసాగించిన భారత్.. చివరికి టైటిల్ ను దక్కించుకుంది.