For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జైట్లీ స్పోర్ట్స్ బడ్జెట్: ఖేలో ఇండియాకు రూ. 520 కోట్లు

By Nageshwara Rao
Khelo India biggest gainer in Sports budget 2018-19

హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం గురువారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గత నాలుగేళ్లుగా ఆర్థిక సంస్కరణలు, ఆదాయపు పన్ను తగ్గింపులు, మధ్యతరగతికి రాయితీల చుట్టూ తిరిగిన బడ్జెట్‌ ఈసారి మాత్రం పేదవాడి బడ్జెట్‌గా నిలిచింది. ముఖ్యంగా అన్ని రంగాలకు న్యాయం చేస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

2018-19 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రీడలకు కూడా పెద్దపీట వేశారు. ముఖ్యంగా క్రీడల్లో భారతదేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర క్రీడల మంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్ట్ ఖేలో ఇండియా. ఈ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్‌కు జైట్లీ రూ. 520.09 కోట్లను కేటాయించారు.

గతేడాది కేటాయించిన రూ. 170 కోట్లకు ఇది అదనం. మొత్తంగా 2018-19 బడ్జెట్‌లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత లభించింది. ఈ బడ్జెట్‌లో యూత్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మొత్తం రూ. 2196.35 కోట్లు కేటాయించారు. గతేడాది ఈ మొత్తం రూ. 1938 కోట్లుగా ఉంది.

ఈ బడ్జెట్‌లో స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)కు తక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. గతేడాది శాయ్‌కు రూ. 429.56 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో ఆ మొత్తం రూ. 66 కోట్లకు కుదించారు. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే, క్రీడాకారులకు ఇచ్చే రివార్డులపై కూడా ఈ బడ్జెట్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా క్రీడాకారులకు ఇచ్చే నేషనల్ వేల్పేర్ ఫండ్‌ను రూ. 334.31 కోట్ల నుంచి రూ. 374 కోట్లకు పెంచింది. ఈ నిర్ణయంతో నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఎంతో లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ రూ. 341 కోట్లు పొందనున్నాయి.

తాజా బడ్జెట్‌లో జమ్మూ కాశ్మీర్‌లో క్రీడల మెరుగుదల కోసం కేటాయించే ఫండ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కాస్త జాగ్రత్తగానే వ్యవహారించింది. గతేడాది బడ్జెట్‌లో రూ. 70 కోట్లు కేటాయించగా 2018-19 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని రూ. 50 కోట్లకు తగ్గించింది.

స్పోర్ట్స్ బడ్జెట్ 2018-19 - హైలెట్స్:

Khelo India biggest gainer in Sports budget 2018-19

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 1, 2018, 18:10 [IST]
Other articles published on Feb 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+