Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అవార్జులు: స‌ర్దార్‌సింగ్‌‌కు రాజీవ్ ఖేల్‌ర‌త్న‌, పుజారా, కౌర్‌లకు అర్జున

హైదరాబాద్: క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఈ ఏడాది ఇద్దరిని వరించింది. భారత హాకీ జట్టు కెప్టెన్ స‌ర్దార్ సింగ్‌, పారాలింపియ‌న్ దేవేంద్ర ఝ‌ఝ‌రియాలు ఈ అవార్డుకి ఎంపికయ్యారు. గతేడాది ఈ అవార్డుని నలుగురికి ప్రకటించగా, ఈ ఏడాది ఇద్దరినే ఎంపిక చేశారు.

1991లో ప్ర‌వేశ‌పెట్టిన ఖేల్ రత్న అవార్డును ఇప్ప‌టివ‌ర‌కు 32 మంది అందుకున్నారు. 1999లో ధ‌న్‌రాజ్ పిళ్లై త‌ర్వాత ఈ అత్యున్న‌త అవార్డు అందుకుంటున్న రెండో హాకీ ప్లేయ‌ర్‌గా స‌ర్దార్‌సింగ్‌ నిలవ‌నున్నాడు. మోడ్రన్ డే హాకీ దిగ్గజాల్లో సర్దార్ సింగ్ ఒకడు.

Khel Ratna Award: Sardar Singh, Para Athlete Devendra Jhajharia Recommended for Top Honour

కామన్‌వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టుని నడిపించాడు. అంతేకాదు భారత హాకీ జట్టు అందించిన అద్భుతమైన మిడ్ ఫీల్డర్స్‌లో ఒకడు. మరోవైపు ఈ అవా్రడు అందుకోనున్న తొలి పారా అథ్లెట్‌గా దేవేంద్ర ఝ‌ఝ‌రియా నిల‌వ‌నున్నాడు. దేవేంద్ర 2016 రియో పారాలింపిక్స్ జావెలిన్ త్రోలో గోల్డ్ మెడ‌ల్ సాధించాడు.

అంత‌కుముందు 2004 ఏథెన్స్ పారాలింపిక్స్‌లోనూ దేవేంద్ర గోల్డ్ మెడ‌ల్ సాధించిన సంగతి తెలిసిందే. వీరిద్దరితో పాటు 17 మందికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులను ప్ర‌క‌టించింది. క్రికెట‌ర్ పుజారా, మ‌హిళా క్రికెట‌ర్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌, పారాలింపియ‌న్ మ‌రియ‌ప్ప‌న్ తంగ‌వేలు, గోల్ఫ‌ర్ శివ్ చౌరాసియాలు అర్జున అవార్డులు అందుకోనున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+