Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ అండర్ 16 టైటిల్ సొంతం చేసుకున్న దక్షిణాదమ్మాయి

Keerthana Pandian wins IBSF World U-16 snooker championship for first international title

హైదరాబాద్: భారత స్నూకర్ ప్లేయర్ కీర్తనా పాండియన్ ఐబీఎస్ఎఫ్ వరల్డ్ అండర్-16 స్నూకర్ ఛాంపియన్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కీర్తనకు ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్ కావడం విశేషం. కీర్తన ఫైనల్లో బెలారస్‌కు చెందిన అల్బినా లె‌స్చక్‌ను 3-1 తేడాతో ఓడించింది. నాలుగో సీడ్‌గా బరిలో దిగిన కీర్తన.. వరుసగా మనస్విని శేఖర్, రష్యాకు చెందిన అలినా ఖైరులినాలను ఓడించింది.

సెమీఫైనల్లో మన దేశానికే చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ అనుపమ రామచంద్రన్‌తో తలపడింది. అనుపమతో పోరులో తొలి ఫ్రేమ్‌ను ఓడినప్పటికీ 3-1 తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. గత ఏడాదే అండర్-16 విభాగంలో స్నూకర్ ఛాంపియన్‌షిప్ ప్రారంభించారు. కీర్తనతోపాటు అనుపమ ఫైనల్ చేరగా.. తుది పోరులో కీర్తన 1-3 తేడాతో ఓడింది.

ఫైనల్లోనూ తొలి ఫ్రేమ్ కోల్పోయిన కీర్తనా.. తర్వాతి ఫ్రేమ్ నెగ్గి 1-1తో స్కోరును సమం చేసింది. తర్వాత పూర్తి నియంత్రణతో ఆడిన ఆమె.. వరుసగా రెండు ఫ్రేమ్‌లను నెగ్గి ఛాంపియన్‌షిప్ సాధించింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో బెల్జియంకు చెందిన బెన్ మార్టిన్స్ విజేతగా నిలిచాడు.

నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన కీర్తన.. స్ట్రెయిట్ ఫ్రేముల్లో మనస్విని శేఖర్, రష్యన్ యువతి అలీనా ఖైరులీనా 3-0తేడాతో ఓడించింది. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత క్రీడాకారిణి అనుపమ రామచంద్రన్‌కు సమానమైంది.

Story first published: Sunday, October 7, 2018, 14:58 [IST]
Other articles published on Oct 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+