Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూట్యూబ్‌లో సంచలనం: వీడియో వైరల్, ఎవరీ కవితా దేవి?

హైదరాబాద్: కవితా దేవి... ప్రస్తుతం యూట్యూబ్‌లో ఓ సెన్షేషన్‌గా మారింది. సల్వార్‌ కమీజ్‌ ధరించి వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో కుస్తీ పట్లు పడుతున్న కవితా దేవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రింగ్‌లో సంప్రదాయ దుస్తుల్లో ఆమె చేసిన పోరాటాన్ని నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారతీయుడిగా ది గ్రేట్‌ ఖలీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హెవీ వెయిట్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచి ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు భారత్ తరుపున అడుగుపెట్టిన భారత తొలి మహిళగా కవితా దేవి చరిత్ర సృష్టించింది.

హర్యానాలోని చిన్న ఊరు

హర్యానాలోని చిన్న ఊరు

కవితా దేవిది హర్యానా రాష్ట్రంలోని జులానా అనే చిన్న ఊరు. ఆడపిల్లల పట్ల విపరీతమైన వివక్ష ఉన్న రాష్ట్రం నుంచి ఆమె ఈ పోటీలకు ఎంపిక కావడం విశేషం. పదోతరగతికి మించి అమ్మాయిలు చదవకూడదనే పరిస్థితులు ఉన్న ఊళ్లో బిఎ డిగ్రీ వరకు చదివిందామె. ఉన్నత చదువులు చదివేందుకు, వెయిట్‌ లిఫ్టర్‌గా మారేందుకు ఆమె అన్నయ్య సందీప్‌ దలాల్‌ చాలా ప్రోత్సహించాడట.

కానిస్టేబుల్‌గా ఉద్యోగం

కానిస్టేబుల్‌గా ఉద్యోగం

స్పోర్ట్స్‌ కోటాలో సహస్త్ర సీమాబల్‌(ఎస్ఎస్ బి)లో కానిస్టేబుల్‌గా చేరింది. ఆ తరువాత స్పోర్ట్స్‌లో కెరీర్‌ బాగుండాలని 2010లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు రాజీనామా చేసింది. ఉద్యోగం చేస్తుండగా టోర్నమెంటుల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వకపోవడం, అంతర్జాతీయ స్థాయిలో రష్యాలో జరిగిన పోటీలకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసింది.

వెయిట్‌లిఫ్టింగ్‌లో, మిక్స్డ్ డమార్షల్‌ ఆర్ట్స్‌లో జాతీయ చాంపియన్‌

వెయిట్‌లిఫ్టింగ్‌లో, మిక్స్డ్ డమార్షల్‌ ఆర్ట్స్‌లో జాతీయ చాంపియన్‌

కవితా దేవి వెయిట్‌లిఫ్టింగ్‌లో, మిక్స్డ్ డమార్షల్‌ ఆర్ట్స్‌లో జాతీయ చాంపియన్‌. 2007లో పలుసార్లు నేషనల్‌ సీనియర్‌ వెయిట్ లిఫ్టింగ్‌ చాంపియన్‌గా నిలిచింది. 2016లో జరిగిన దక్షిణాసియా గేమ్స్‌లో 75 కేజీల కేటగిరీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచంలోనే మొదటిసారి మహిళలకోసం ఏర్పాటుచేసిన డబ్ల్యుడబ్ల్యుఇ పోటీల్లో మన దేశం నుంచి ఎంపైకైంది.

కండబలంతో పైకి ఎగరేసి కింద పడేసింది

మే యంగ్‌ క్లాసిక్‌ టోర్నీలో న్యూజిలాండ్‌ రెజ్లర్‌ కోటా కైతో తలపడింది. అయితే ఆమె నారింజ రంగు సల్వార్‌ కమీజ్‌ ధరించి కుస్తీ పట్టిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. సల్వార్ కమీజ్ డ్రస్సులో తన ప్రత్యర్థిని తన కండబలంతో పైకి ఎగరేసి కింద పడేసింది. అయితే ఈ పోటీలో ఆమె ఓడినప్పటికీ, ఆమె పోరాటం మాత్రం ఎందరినో ఆకట్టుకుంటోంది. ఆగస్టు 31న యూట్యూబ్‌లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆమె కుస్తీ ప్రదర్శనను 30 లక్షల మందికి పైగా వీక్షించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+