అమెరికాలో అనుమతి లేకుండా బాలికకు ముద్దు: అరెస్టైన కాశ్మీరీ అథ్లెట్
హైదరాబాద్: అమెరికాలోని పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లి అక్కడి 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో భారత అథ్లెట్ తన్వీర్ హుస్సేన్‌ని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాశ్మీర్‌కు చెందిన స్నోషూ రేసర్ తన్వీర్ హుస్సేన్ న్యూయార్క్‌లోని సారనాక్ లేక్ విలేజ్‌లో అరెస్ట్ చేశారు.
అమెరికాకు చెందిన ఓ వెబ్‌సైట్ కథనం ప్రకారం 24 ఏళ్ల తన్వీర్‌ను అరెస్ట్ చేసినట్లు రాసుకొచ్చింది. ఈ ఘటనలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, తన్వీర్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన వాస్తవమేనని స్నో షూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మీర్ ముదసిర్ స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 23 నుంచి 25వ తేదీ వరకు జరిగిన 2017 ప్రపంచ స్నో షూ చాంపియన్‌షిప్ పోటీలలో హుసేన్ పాల్గొన్నాడు. నిజానికి గురువారం అక్కడినుంచి బయల్దేరాల్సి ఉండగా, బుధవారమే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన్వీర్ హుస్సేన్ జమ్మూ& కాశ్మీర్ బ్యాంకు ఉద్యోగి.

ఎలాంటి నేరం చేయలేదు
అయితే, తాను నిర్దోషినని, ఎలాంటి నేరం చేయలేదని హుస్సేన్ చెప్తున్నాడు. అయితే సారనాక్ లేక్ విలేజ్ పోలీసులు మాత్రం హుస్సేన్ 12 ఏళ్ల బాలికను అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నాడని పేర్కొన్నారు. అంతేకాదు ఆమెను తాకరాని చోట్లు తాకాడని కూడా పోలీసులు తెలిపారు.

సెనేటర్ల సాయంతోనే అమెరికాకు
ఈ ఏడాది జనవరిలో హుస్సేన్‌తో పాటు ఖాన్ అనే మరో క్రీడాకారుడికి కూడా అమెరికా వెళ్లేందుకు వీసా నిరాకరించారు. అయితే గ్రామ సర్పంచ్ ఈ విషయాన్ని అమెరికా సెనేటర్లు కిరిస్టెన్ గిల్లీబ్రాండ్, చార్లెస్ షుమర్ సాయంతో పై అధికారుల వద్దకు తీసుకెళ్లడంతో ఎట్టకేలకు వీసా వచ్చింది.

స్థానికులే విరాళాలు వసూలు చేసి ఇచ్చారు
దీంతో స్థానికులు వాళ్లకు ఉచితంగా వసతి కల్పించడంతో పాటు భోజనం పెట్టి, వారం రోజుల పాటు వాళ్ల ప్రయాణ ఖర్చుల కోసం లక్ష రూపాయలకు పైగా విరాళాలు కూడా వసూలు చేసి ఇచ్చారు. హుస్సేన్‌కు న్యాయ సహాయం అందిస్తున్నామని, ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న భారత రాయబార కార్యాలయంతో అటార్నీ చర్చిస్తారని ముదసిర్ చెప్పారు.

సాయం చేసేందుకు ముందుకొచ్చిన భారతీయ కుటుంబాలు
హుస్సేన్ ఇంగ్లీషు మాట్లాడటం రాకపోవడంపతో ఆ ప్రాంతంలో ఉండే రెండు భారతీయ కుటుంబాలు అతడికి సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. వ్యక్తిగతంగా ఈ వివాదంతో తాను చాలా ఇబ్బంది పడుతున్నానని, అమెరికన్ చట్టాల మీద దనకు పూర్తి విశ్వాసం ఉందని ముదసిర్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications