న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌ను లండన్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డుల కార్యక్రమం బుధవారం లండన్ లోని 'హౌస్ ఆఫ్ లార్డ్స్' లో జరిగింది.
క్రికెట్ రంగంలో విశేష సేవలందించడంతో పాటు, ఖుషి సొసైటీ పేరుతో బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడడాన్ని గుర్తిస్తూ మాజీ ప్రపంచ కప్ కెప్టెన్ విజేతైన కపిల్ దేవ్‌కు ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరం (ఐబీఈఎఫ్) అవార్డు అందించింది.

ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ, భారతీయున్ని అయినందుకు ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో భారత్ బిజినెస్ చేసేందుకు సిద్దంగా ఉందని అన్నారు. భారత్‌ను పాలించినందుకు ఇంగ్లాండ్‌ను ద్వేషిస్తానని, అయితే, క్రికెట్‌ను మనకు పరిచయం చేసినందుకు సంతోషిస్తానని పేర్కొన్నారు. వారు క్రికెట్ ఆడడంలో ఎలా తడబడతారో, తాను ఇంగ్లీషు మాట్లాడడంలో అలానే ఇబ్బంది పడతానని చమత్కరించారు.
1983లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌కి కపిల్ దేవ్ కెప్టెన్‌గా ఉన్నారు. లార్డ్స్ మైదానంలో వెస్టిండిస్‌పై భారత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ ఆల్ రౌండర్. 55 ఏళ్ల కపిల్ దేవ్ టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధికంగా 434 వికెట్లు తీసిన రికార్డుని కొన్నేళ్లపాటు తన పేరుమీద నమోదు చేశాడు. ఐదే ఆ రికార్డుని 2000వ సంవత్సరంలో వెస్టిండిస్ కెప్టెన్ కోట్నీ వాల్స్ అధిగమించాడు.