కుప్పకూలిన శ్రీలంక : స్కోర్ 229

అంతకు ముందు చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన భారత బౌలర్ శ్రీశాంత్ తన ధాటిని శ్రీలంక బ్యాట్స్ మెన్ కు చవి చూపించాడు. రెండో టెస్టు మ్యాచులో మూడో రోజు గురువారం లంచ్ విరామ సమయానికి శ్రీలంత తొలి ఇన్నింగ్సులో 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. శ్రీశాంత్ మూడు ప్రధానమైన వికెట్లను పడగొట్టాడు. ఇంకా శ్రీలంక భారత్ కు 504 పరుగులు వెనకబడి ఉంది. శ్రీలంక వికెట్లు క్రమం తప్పకుండా పడుతూ వచ్చాయి. దీంతో భారత బౌలర్లకు శ్రీలంక బ్యాట్స్ మెన్ ఎదురీదుతున్నారు.
గురువారం తొలి వికెట్ ను హర్బజన్ అంజిలో మాథ్యూస్ రూపంలో శ్రీలంక తొలి వికెట్ ను పడగొట్టాడు. మాథ్యూస్ 13 పరుగులకు అవుటయ్యాడు. గురువారం శ్రీలంక వికెట్లు నాలుగు పడ్డాయి. జహీర్ ఖాన్ బుధవారంనాడు దిల్షాన్ వికెట్ తీశాడు. మిగతా మూడు వికెట్లు గురువారం శ్రీశాంత్ కు లభించాయి. కుమార సంగక్కర 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధోనీకి క్యాచ్ ఇచ్చి శ్రీశాంత్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. 38 పరుగులు చేసిన తరంగ పరణవితరణ కూడా శ్రీశాంత్ బౌలింగ్ లో అవుటయ్యాడు. తిలాన్ సమర వీర కూడా శ్రీశాంత్ బౌలింగ్ లో 2 పరుగు వ్యక్తిగత పరుగుల వద్ద అవుటయ్యాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications