For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డులు: కమిటీకి ఛైర్మన్‌గా జస్టిస్ ముద్గల్

Justice Mudgal to head selection committee for Dronacharya, Dhyanchand awards

హైదరాబాద్: కోచ్‌లు, క్రీడాకారులకు భారత ప్రభుత్వం అందించే అత్యున్నత అవార్డులైన ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డులకు అర్హులను ఎంపిక చేసే కమిటీ బాధ్యతలను జస్టిస్ ముకుల్ ముద్గల్‌కు అప్పగించనున్నారు. అయితే, ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

"దీనిపై సెప్టెంబర్ 16న ఢిల్లీలో సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకపోలేదు" అని కేంద్ర క్రీడాశాఖ ఉన్నాతాధిక ఒకరు తెలిపారు. ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డులకు అర్హులను ఎంపిక చేసే కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉండనున్నారు.

ఈ 11 మంది సభ్యుల కమిటీకి జస్టిస్ ముకుల్ ముద్గల్‌ నేతృత్వం వహించనున్నారు. ఎంపిక కమిటీలో షూటర్ సమరేష్ జంగ్, షట్లర్ అశ్వినీ పొన్నప్ప, బాక్సింగ్ జాతీయ మాజీ కోచ్ జిఎస్ సంధు, హాకీ కోచ్ ఏకె బన్సల్, ఆర్చరీ కోచ్ సంజీవ సింగ్, స్పోర్ట్స్ అథారిటీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఓంకార్ కెడియా, సంయుక్త కార్యర్శి (స్పోర్ట్స్) ఇందర్ ధమిజలు ఉన్నారు.

వీరితో పాటు ఇద్దరు స్పోర్ట్స్ జర్నలిస్టులు, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ సీఈఓ కమాండర్ రాజేష్ రాజగోపాలన్ కూడా ఉన్నారు. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణను సుప్రీం కోర్టు అప్పట్లో ముకుల్ ముద్గల్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కమిటీ నాయకత్వ బాధ్యతలనూ ముద్గల్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ అప్పగించనుంది.

Story first published: Friday, September 14, 2018, 19:53 [IST]
Other articles published on Sep 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+