Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షూటింగ్ వరల్డ్ కప్: భారత్ ఖాతాలో మరో పసిడి పతకం

Junior Shooting World Cup: Muskan wins gold as India pip China at the top

హైదరాబాద్: సిడ్నీ వేదికగా జరుగుతోన్న జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్ కప్‌లో భారత యువ షూటర్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా బుధవారం జరిగిన పోటీల్లో భారత క్రీడాకారిణి ముస్కాన్‌ బన్వాలా స్వర్ణం నెగ్గింది. టోర్నీలో భాగంగా చివరి రోజైన ఈరోజు మహిళల వ్యక్తిగత 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ పోటీల్లో 16 ఏళ్ల ముస్కాన్‌ అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం కైవసం చేసుకుంది. అంతర్జాతీయ ఈవెంట్‌లో ముస్కాన్‌కు ఇది తొలి పతకం కావడం విశేషం. చైనాకు చెందిన కిన్ షినాంగ్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా, థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి కన్యకోర్న్ హిరున్పోమ్ కాంస్య పతకం సొంతం చేసుకుంది.

మరోవైపు ఇదే ఈవెంట్‌లో పోటీ పడిన మను బకర్ ఆరో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ముస్కాన్‌ మాట్లాడుతూ 'స్వర్ణం దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అంతర్జాతీయ వేదికపై ఇది నా తొలి పతకం. నమ్మలేకపోతున్నాను' అని సంతోషం వ్యక్తం చేసింది.

టోర్నీలో ఇప్పటివరకు భారత్ 22 పతకాలు సాధించింది. ఇందులో తొమ్మిది బంగారు, ఐదు రజతాలు, ఎనిమిది కాంస్య పతకాలు ఉన్నాయి. అత్యధికంగా చైనా 25 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత భారత్ 22 పతకాలతో పాయింట్ల పట్టికలో రెండు స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Wednesday, March 28, 2018, 16:04 [IST]
Other articles published on Mar 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+