Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌: భారత్ ఖాతాలో మరో స్వర్ణం

Junior Shooting World Cup: Anish Bhanwala adds to India’s gold tally with 25m Rapid Fire Pistol win

హైదరాబాద్: సిడ్నీ వేదికగా జరుగుతోన్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన పురుషుల 25 మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్ ఈవెంట్‌‌లో భారత్‌కు చెందిన 15 ఏళ్ల అనిశ్‌ భన్‌వాలా అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం గెలుచుకున్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో అనిశ్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. చైనాకు చెందిన చెంగ్ జీపింగ్ (27 మొత్తం హిట్స్)తో రెండో స్థానంలో నిలవగా, చాంగ్ జుయిమింగ్(23 మొత్తం హిట్స్)తో మూడో స్ధానంలో నిలిచి
కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. మరో ఇద్దరు భారత షూటర్లు అన్‌హాద్‌, రాజ్‌కన్వార్‌ సింగ్‌.. నాలుగు, ఆరు స్థానాల్లో నిలిచారు.

అంతర్జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో అనిశ్‌‌కు ఇదే తొలి పతకం కావడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక, టీమ్ ఈవెంట్‌లో ఆనంద్, ఆదర్శ సింగ్‌లతో పాల్గొన్న అనిశ్‌ వెండి పతకం నెగ్గాడు. 1733 పాయింట్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన చైనీస్‌ టీమ్ స్వర్ణం పతకం ఎగరేసుకుపోయింది.

ఈనెల మొదట్లో మెక్సికో వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ సీనియర్‌ వరల్డ్ కప్ టోర్నీలో కూడా అనిశ్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా, శనివారం జరిగిన పోటీల్లో భారత్‌కు చెందిన మను బాకర్‌ వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, March 26, 2018, 16:02 [IST]
Other articles published on Mar 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+