Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కూతురుకు 'ఇండియా' పేరు: అందుకే ఆ పేరు పెట్టానని జాంటీ రోడ్స్

ముంబై: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే ఇష్టం వల్లే తాను తన కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టానని దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌, ముంబై ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్‌ అన్నాడు. భారత్‌లో తెలుసుకోవడానికి ఎప్పుడూ ఏదో కొత్త విషయం ఉంటుందన్నాడు.

ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు అద్భుతమని కొనియాడాడు. ఆధ్యాత్మికత, ముందుచూపు రెండూ ఉన్న దేశం ఇది అని కితాబిచ్చాడు. తాను భారత్‌లో చాలా సమయం గడిపానని చెప్పాడు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయలు ఉంటాయన్నాడు.

భారత్ ముందు చూపున్న దేశమన్నాడు. ఇక్కడి వారు తమ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తారన్నాడు. ఇండియా అని తన కూతురుకు పేరు పెట్టిన నేపథ్యంలో తన కూతురు కూడా తన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

Jonty Rhodes Reveals Why he Named his Baby Daughter, India

కాగా, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ సతీమణి మిలేనీ జెన్నీ ముంబైలోని శాంతా క్రజ్‌లోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి పాపకు గురువారం జన్మనివ్వగా, ఆ పాపకు ఇండియా జెన్నీ రోడ్స్ అని పేరు పెట్టారు.

ఇండియాలో అంతగా ప్రాచుర్యం పొందని 'వాటర్ బర్త్' ద్వారా పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8వ ఎడిషన్‌లో బిజీగా ఉన్న జాంటీ రోడ్స్ డెలివరీ కోసం మూడు నెలల ముందే భారత్‌కు వచ్చారు.

గురువారం మధ్యాహ్నాం 3:29 గంటలకు పాప పుట్టిందని, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారని... బిడ్డ 3.71 కిలోల బరువుందని శాంతా క్రూజ్‌లోని సూర్య మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ భూపేంద్ర అశ్వతీ తెలిపారు. జాంటీ రోడ్స్ దంపతులు తమ పాపాకు ఇండియా జెన్నీ జాంటీ రోడ్స్‌గా నామకరణం చేశారు.

భారత్‌లో తన భర్త ఐపీఎల్ సీజన్‌లో బిజీగా ఉండటం వల్ల బిడ్డకు జన్మనిచ్చేందుకు వారు 'వాటర్ బర్త్' విధానాన్ని ఎంచుకున్నారని, అందుకోసం మూడు నెలలుగా శిక్షణ తీసుకున్నారని వెల్లడించారు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో అత్యధిక జననాలు ఈ 'వాటర్ బర్త్' విధానంలోనే జరుతున్నాయని ఆమె వివరించారు.

గత నాలుగు సంవత్సరాలుగా మా ఆసుపత్రిలో 'వాటర్ బర్త్' విధానంలోనే డెలివరీలు చేస్తున్నామని, ఇప్పటి వరుక 35 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. జాంటో రోడ్స్‌కు భారత్ క్రికెట్‌తో ఉన్న సంబంధం చెప్పలేనిది. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు సేవలందించిన జాంటీ రోడ్స్ ఐపీఎల్‌లో ముంబై జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+