ముంబై ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ దంపతులకు పాప: పేరు 'ఇండియా'
ముంబై: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ సతీమణి మిలేనీ జెన్నీ ముంబైలోని శాంతా క్రజ్‌లోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి పాపకు గురువారం జన్మనిచ్చారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా?
మిలేనీ జెన్నీ పాపకు జన్మినిచ్చేందుకు ఎంచుకున్న విధానం తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఇండియాలో అంతగా ప్రాచుర్యం పొందని 'వాటర్ బర్త్' ద్వారా పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8వ ఎడిషన్‌లో బిజీగా ఉన్న జాంటీ రోడ్స్ డెలివరీ కోసం మూడు నెలల ముందే భారత్‌కు వచ్చారు.
గురువారం మధ్యాహ్నాం 3:29 గంటలకు పాప పుట్టిందని, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారని... బిడ్డ 3.71 కిలోల బరువుందని శాంతా క్రూజ్‌లోని సూర్య మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ భూపేంద్ర అశ్వతీ తెలిపారు. జాంటీ రోడ్స్ దంపతులు తమ పాపాకు ఇండియా జెన్నీ జాంటీ రోడ్స్‌గా నామకరణం చేశారు.

భారత్‌లో తన భర్త ఐపీఎల్ సీజన్‌లో బిజీగా ఉండటం వల్ల బిడ్డకు జన్మనిచ్చేందుకు వారు 'వాటర్ బర్త్' విధానాన్ని ఎంచుకున్నారని, అందుకోసం మూడు నెలలుగా శిక్షణ తీసుకున్నారని వెల్లడించారు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో అత్యధిక జననాలు ఈ 'వాటర్ బర్త్' విధానంలోనే జరుతున్నాయని ఆమె వివరించారు.
గత నాలుగు సంవత్సరాలుగా మా ఆసుపత్రిలో 'వాటర్ బర్త్' విధానంలోనే డెలివరీలు చేస్తున్నామని, ఇప్పటి వరుక 35 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. జాంటో రోడ్స్‌కు భారత్ క్రికెట్‌తో ఉన్న సంబంధం చెప్పలేనిది. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు సేవలందించిన జాంటీ రోడ్స్ ఐపీఎల్‌లో ముంబై జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications